Cheteshwar Pujara: టీమిండియా క్రికెటర్ చతేశ్వర్ పుజారా తాజాగా రిటైర్మెంట్ ప్రకటించేశాడు. టెస్ట్ క్రికెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు పుజారా. ఇటీవలే అక్టోబర్ లో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ సీజన్ లో పాల్గొనడానికి తన ఆసక్తిని కనబరిచాడు. ఫిబ్రవరిలో ముగిసిన గత సీజన్ రంజీ ట్రోఫీ తరువాత 37 ఏళ్ల పుజారా తొలిసారి పోటీ చర్యలోకి తిరిగి వస్తున్నాడని వార్త వినిపించిన విషయం తెలిసిందే. ఇక ఇంతలోనే చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ ప్రకటించాడని వార్త రావడం విశేషం. అసలు పుజారా ఇంత సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవడానికి మాత్రం కారణం ఇంకా తెలియడం లేదు. అజింక్య రహానె ముంబై కెప్టెన్సీ నుంచి వైదొలిగిన కొద్ది గంటల తరువాతనే పుజారా ఈ విషయాన్ని ధృవీకరించాడు. భారత జట్టు స్టార్ ప్లేయర్ పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
Also Read : Yuzvendra chahal : చాహల్ కు షాక్… ఆ పొలిటీషియన్ తో RJ మహ్వాష్ ఎ**ఫైర్?
వారందరికీ కృతజ్ఞతలు
“భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడటం, గ్రౌండ్ లో అడుగుపెట్టిన ప్రతీసారి నా శాయశక్తులా ఆడేందుకు ప్రయత్నించా. నాకు అవకాశాలు కల్పించిన బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్, జట్లు, ఫ్రాంచైజీలకు కృతజ్ఞతలు” అంటూ X వేదికగా రాసుకొచ్చారు. ముఖ్యంగా చతేశ్వర్ పుజారా 2023లో భారత జట్టు తరుపున తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. చివరిసారిగా ఆస్ట్రేలియా సిరీస్ లో కనిపించాడు. ఇప్పటి వరకు టీమిండియా తరపున మొత్తం 103 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 7195 పరుగులు చేశాడు. టీమిండియా తరపున ఈ ఆటగాడు మూడు సార్లు డబుల్ సెంచరీ కూడా సాధించాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి టీమిండియాలో ఎంపిక కాకపోవడం కాస్త నిరాశ పరిచిందని ఇటీవలే వాపోయాడు పుజారా.
అందరినీ ఆశ్చర్యపరిచిన పుజారా
” ముఖ్యంగా ఒక వ్యక్తి ఆ స్థాయిలో విజయం సాధించి.. 100 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్ లు ఆడి, ఆ జట్టులో భాగం కానప్పుడు ఆ విజయానికి దారి తీసిన కృషిని కొనసాగిస్తూనే ఉండాలి. నాకు ఈ ఆట చాలా ఇస్టం. నాకు ఏ అవకాశంవచ్చినా.. అది దేశవాళీ అయినా లేదా కౌంటీ క్రికెట్ అయినా నేను దానిని పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాను. విఫలమైనప్పుడు ఒక జట్టుగా విఫలమవుతారు. ఒక్క ఆటగాడి వల్ల కాదు.. కాబట్టి జట్టులో భాగం కాకపోవడం నాకు కచ్చితంగా నిరాశ కలిగిస్తుంది. నేను దానిని సానుకూలంగా తీసుకుంటాను. నా నియంత్రణలో ఉన్న విషయాలపై దృష్టి పెడతాను. నేను భారత దేశం కోసం చేసిన మంచి ప్రదర్శనలు గుర్తుంచుకోవడం ద్వారా నేను ప్రేరణ పొందుతాను. సౌరాష్ట్ర అయినా, సక్సెస్ అయినా నేను ఎప్పుడూ జట్టు విజయం కోసం ఆడటానికి ప్రయత్నిస్తాను. నేను భారత జట్టులోకి తిరిగి వస్తే.. బాగా ఆడటానికి ప్రయత్నిస్తాను” అంటూ ఇటీవలే సెలెక్టర్లను అభ్యర్థించాడు. ఇంగ్లాండ్ టూర్ కి పుజారాను సెలెక్ట్ చేయకపోవడంతో.. తన మనస్సులో ఏమనుకున్నాడో ఏమో తెలియదు. అకస్మాత్తుగా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.