BigTV English

BRS Leaders For AP: ఏపీకి బీఆర్ఎస్ లీడర్లు.. కేసీఆర్ ప్లాన్ ఇదేనా..

BRS Leaders For AP: ఏపీకి బీఆర్ఎస్ లీడర్లు.. కేసీఆర్ ప్లాన్ ఇదేనా..

తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారతీయ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది గులాబీ పార్టీ.. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారాక పదేళ్లు అధికారంలో కూడా కొనసాగింది. అసలు ఆ పార్టీ పుట్టి ఇప్పటికి 24 ఏళ్లు అవుతుంది. 2001 నుంచి ఎన్నెన్నో ఉద్యమ వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలతో పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు కేసీఆర్.. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేసీఆర్ ఒన్ మాన్ షోతోనే కారు మొన్నమొన్నటి వరకు పరుగులెట్టింది.

అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలవ్వడంతో ఆ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమదారి తాము చూసుకుంటున్నారు. అసలు ఉండేవారెవరో ఊడేవారెవరో అర్థం కాకుండా తయారవుతోంది. ఓటమి తర్వాత వరుస పరిణామాలతో కేసీఆర్ తన ఫాంహౌస్‌కే పరిమితమవుతున్నారు. వాస్తవానికి రెండు సార్లు విజయం సాధించిన గులాబీ పార్టీ వలస ఎమ్మెల్యేలతోనే అసెంబ్లీలో బలం పెంచుకుంది.


మొదటి సారి బొటాబొటీ మెజార్టీతో గెలిచిన కేసీఆర్.. అప్పట్లో గెలిచిన వైసీపీ, బీఎస్పీ, టీడీపీ ఎమ్మెల్యేలను విలీనం పేరుతో కలిపేసుకుని వారికే తర్వాత టికెట్లు ఇస్తూ వచ్చారు. రెండో సారి గెలిచినప్పడు కూడా అదే సీన్ కనిపించింది. 2018లో రెండో సారి బాధ్యతలు చేపట్టినప్పుడు సైతం టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరించో, బామాలో కారెక్కించుకున్నారు. తర్వాత కూడా సిట్టింగు ఎమ్మెల్యేలకే టికెట్లు అంటూ వలస నేతలకే టికెట్లిచ్చి ఓటమి మూటగట్టుకున్నారు.

సంస్థాగతంగా చూస్తే తెలంగాణ సెంటిమెంటుతో 2014లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన 63 మందే నిజమైన గులాబీ నేతలని చెప్పాలి. అప్పట్లో వారిలో చాలా మంది ఎన్నికలకు కొత్తే ఉద్యమ సెంటిమెంట్ ఆ పార్టీకి కలిసి వచ్చింది. 2018లోనూ అదే సెంటిమెంట్ ప్రయోగించి కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అంతేకాని పార్టీ సంస్థాగత నిర్మాణం, కేడర్‌ని సమర్ధంగా నడిపించే నాయకత్వం ఆ పార్టీకి ముందు నుంచీ లేదనే చెప్పాలి. ఆ ప్రభావం ఏ సెంటిమెంటూ పనిచేయని 2023 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.

Also Read: ఆయన ప్రధాని కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరు..: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఆ వాస్తవాన్ని ఇప్పటికి గ్రహించారో ఏమో పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు గులాబీ నేతలు.. పక్క రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నిర్మాణంపై స్టడీ చేయడానికి వెళ్లి వస్తామంటున్నారు. సెప్టెంబరులో పార్టీ సీనియర్ నేతలతో కలిసి వివిధ రాష్ట్రాల్లో తిరిగి వస్తానంటున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వచ్చాక పార్టీ బలోపేతానికి అవసరమైతే కొత్త కమిటీలు వేసుకుంటామని వెల్లడించారు.

పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా తమ అధ్యయనం ఉంటుందంటున్నారు బీఆర్ఎస్ చిన్నబాస్.. మంచి ఎక్కడున్నా నేర్చకుంటామంటున్న ఆయన టీడీపీతో పాటు వైసీపీ నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటారంట.

ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలతో బీఆర్ఎస్ కేడర్ చెట్టకొకరు పుట్టకొకరు అన్నట్లు చెదిరిపోతోంది. మరిలాంటి పరిస్థితుల్లో 24 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన గులాబీ పార్టీ ఇప్పుడు కొత్తగా ఏం అధ్యయనం చేస్తుందో? పార్టీ పరంగా ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాలి

Tags

Related News

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Big Stories

×