BigTV English

Aghori: అఘోరీ మగాడేరా బుజ్జి.. డాక్టర్ రిపోర్ట్ చూస్తే షాకే

Aghori: అఘోరీ మగాడేరా బుజ్జి.. డాక్టర్ రిపోర్ట్ చూస్తే షాకే

Aghori: అతిగా ఆవేశపడే ఆడది.. అతిగా ఆశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఇది.. ఒకప్పడు రజనీకాంత్ చెప్పిన పంచ్ డైలాగ్. మరి ఆ రెండూ ఒకరే అయితే? అతిగా ఆవేశపడే ఆడది.. అతిగా ఆశపడే మగాడు కలిస్తే? ఇలా అతిగా ప్రవర్తించే ఓ అఘోరీలాంటి కటౌట్ బయటకొస్తుంది. ఆ క్యారెక్టర్ చేసే చిత్ర, విచిత్ర వేషాలు.. ఎలా ఉంటాయో రెండు తెలుగు రాష్ట్రాలు చూశాయి. ఆఖరికి అఘోరీ చర్యలే.. అతన్ని జైలు పాలు చేశాయి.


లేడీ అఘోరీగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా సంచలనం సృష్టించాడు. తనకు తాంత్రిక శక్తులు ఉన్నాయంటూ.. పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. సామాజిక మాద్యమాల్లో అఘోరీ శ్రీనివాస్ వీడియోలు వైరల్‌గా మారాయి కూడా . అనేక మంది అఘోరీకీ భక్తులుగా కూడా మారారు. మంగళగిరి నుంచి ఓ యువతిని తీసుకెళ్లడం పెద్ద వివాదాస్పదంగా మారింది.

అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ఆదిలాబాద్‌కు చెందిన వ్యక్తి.. అతనిపైన ఇటీవల మోకిలా పోలీస్టేషన్‌లో ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. తనకు ఉన్న ఇబ్బందులను దూరం చేసేందుకు.. తనకు తాంత్రిక పూజలు చేస్తానంటూ ఆ మహిళను మోసగించాడు. నగ్న పూజల పేరుతో ఓ మహిళ నుంచి 10 లక్షలు వసూలు చేసి.. బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ మోకిలా పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మధ్యప్రదేశ్ నుంచి అఘోరా శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి చంచల్ గూడా జైలుకు తరలించారు. ఈ అఘోరీ ఎపిసోడ్‌తో ఒక విషయం మాత్రం క్లియర్‌గా అర్థమైంది. అతిగా.. మతిపోయి ప్రవర్తించే అఘోరీ అయినా.. చట్టానికి అతీతం కాదని తేలిపోయింది.


అయితే తాజాగా అఘోరీ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలను పేర్కొన్నారు.. పోలీసులు. తన పురుషాంగాన్ని శివుడికి అర్పించానంటూ గతంలో అఘోరీ చెప్పినా… రిమాండ్ రిపోర్ట్‌లో అసలు విషయం బయటపడింది. దొంగతనం చేసినందుకు శ్రీనివాస్ పురుషాంగాన్ని గ్రామస్తులు కాల్చారంటూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. చిన్నప్పుడు శ్రీనివాస్ తరచూ దొంగతనాలు చేసేవాడని, వాటికి గ్రామస్తులు శిక్షలు వేసేవారని చెప్పారు.

ఓసారి వేసిన శిక్షలో శ్రీనివాస్ జననేంద్రియాలు కాలిపోయాయని, తీవ్ర ఇన్ఫెక్షన్ రావడంతో పురుషాంగంలో కొంతభాగాన్ని డాక్టర్లు తొలగించారని వెల్లడించారు. దాంతో… 2023లో చెన్నై వెళ్లి పురుషాంగాన్ని పూర్తిగా తొలగించుకున్న శ్రీనివాస్, 2024లో ఇండోర్‌కు వెళ్లి వృషణాలు కూడా తొలగించుకున్నాడు.

Also Read: నా కర్మ .. పెళ్లి చేసుకున్న సుఖం లేదు.. బోరున ఏడ్చిన బర్రెలక్క

అఘోరీలా మారితే త్వరగా పాపులర్ కావచ్చని భావించిన శ్రీనివాస్‌… స్త్రీ లక్షణాలు వచ్చే హార్మోన్ థెరపీ కూడా తీసుకున్నాడని పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో వెల్లడించారు. జుట్టు పెంచుకుని అఘోరీలా మారిన శ్రీనివాస్‌.. భక్తుల నుంచి డబ్బులు, కానుకలు డిమాండ్ చేశాడని, ఇవ్వకపోతే తాంత్రిక శక్తులతో అంతం చేస్తానని బెదిరించే వాడని పోలీసులు చెప్పారు.

అఘోరీ స్వతహాగా ట్రాన్‌జెండర్ కాదని కూడా రిమాండ్ రిపోర్ట్ తేల్చిసింది. అఘోరీలా జనాన్ని ఆకర్షించడం కోసమే శ్రీనివాస్‌ సర్జరీలు చేయించుకున్నాడని పోలీసులు బయటపెట్టారు.

 

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×