అంతకు ముందు ఆమె డిగ్రీ చేసి జాబ్ దొరక్క బర్రెలు కాసుకుంటున్నా అంటూ.. చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది. దాంతో ఆమెకు బర్రెలక్క అనే పేరు వచ్చింది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది ఎన్నికల సమయంలో బర్రెలక్కాకు మద్దతు ఇచ్చారు. అయితే ఆమె పై ఎంత సింపతీ వచ్చిందో.. ట్రోల్స్ కూడా అంతే వచ్చాయి. చాలా మంది సోషల్ మీడియాలో బర్రెలక్కను రకరకాలుగా ట్రోల్స్ చేశారు.
సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉందో.. అంతకు మించిన నష్టం కూడా ఉంది. చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు. సినిమాల్లో ఛాన్స్‌లు అందుకున్నారు. ఎక్కువగా ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను కూడా సొంతం చేసుకున్నారు. అయితే మరికొంతమంది మాత్రం పరువు పోగొట్టుకున్నారు. చాలా మంది ట్రోల్స్‌కు గురయ్యారు. అయితే ఇప్పుడు బర్రెలక్క కూడా సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఇబ్బందిపడుతుంది.
ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న బర్రెలక్క.. వెంకట్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బర్రెలక్క పెళ్లిపై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. తాజాగా బర్రెలక్క అలియాస్ శీరీష వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: ఎవడ్రా రూల్ పెట్టింది..? బస్సులో కల్లు బాటిళ్లు.. నడిరోడ్డుపై మహిళ హల్చల్
తాజాగా శిరీషా అలియాస్ బర్రెలక్కకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తన ఏడుస్తూ.. నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు. మానసికంగా హింసిస్తున్నారు. నాపై ట్రోల్స్ చేస్తూ విడిచిపెట్టట్లేదు అంటూ బోరున ఏడ్చింది. అదే విధంగా.. గుర్తుపెట్టుకోండి కర్మ ఎవరిని వదలదు. నన్ను ఎవరైతే సతాయించారో వాళ్లందరు కూడా కష్టాలు తప్పవని.. చెప్తూ బర్రెలక్క ఓ వీడియోను రిలీజ్ చేసింది. తనపై వస్తున్న ట్రోల్స్‌పై కంటతడి పెట్టుకుంది. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి .. తనపై ట్రోల్స్ వస్తున్నాయని, తన పెళ్లిపైనా ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘నేను ఏం తప్పు చేశాను’ అంటూ ప్రశ్నించింది.