E-Paper
Advertisement

Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు.. నిరుద్యోగ ర్యాలీలో రేవంత్ నిప్పులు..

Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు.. నిరుద్యోగ ర్యాలీలో రేవంత్ నిప్పులు..
Advertisement
Revanth Reddy speech

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్‌ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు రేవంత్‌రెడ్డి. ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్.. ఆయన ఇంట్లో వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని మండిపడ్డారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్‌రెడ్డి.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కమిషన్ చైర్మన్, సభ్యులతో పాటు.. మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని రేవంత్ మండిపడ్డారు.

Advertisement

90 సీట్లతో తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు రేవంత్‌రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది సీట్లు గెలిచేలా కార్యకర్తలు ఒక్కటిగా పని చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనన్నారు.

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వెంట్రుకతో సమానమని.. ఏలేటి పోయినంత మాత్రాన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. ఒక్కడు పోతే వంద మంది పుట్టుకొస్తారన్నారు రేవంత్.

Advertisement

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ చౌక్ నుంచి.. అంబేడ్కర్ చౌక్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్నర్‌ మీటింగ్‌లో బీఆర్‌ఎస్‌, బీజేపీలపై నిప్పులు చెరిగారు టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×