
Pushkar Punya:- గంగమ్మ పుష్కరాలు వచ్చేశాయి. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి కాశీనో మరో చోటకి వెళ్లలేని వారి పరిస్థితి ఏంటి.. అలాంటి వారు పుష్కర పుణ్యం సంపాదించడానికి మార్గాలు ఉన్నాయి. గంగా జలాన్ని, పసుపును కలుపుకుని ఆ నీళ్లతో స్నానం ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత గంగా పవిత్ర జలాన్ని ఇంటిలోపలంతా చల్లాలి. అలా చల్లేటప్పుడు పుష్కర మంత్రాన్ని మూడు సార్లు జపించాలి.
ఇంట్లో ఉండి ఇలా చేయడం వల్ల పవిత్ర పుష్కరాల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు సూచిస్తున్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈమార్గాన్ని సెలవిచ్చారు. గంగా పుష్కరాలకి వెళ్లి పుష్కరస్నానం ఆచరించలేని వారు పుష్కర మంత్రాన్ని జపిస్తూ చేస్తే తగిన ఫలితం దక్కుతుంది.
పరిస్థితులు అనుకూలించి గంగ పుష్కరాలకు స్వయంగా పాల్గొనే వారు ఉత్తమఫలితాలను పొందుతారు. ముక్కోటి దేవతలు, మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలు పుష్కరాల సమయంలో గంగ నదిలో ప్రవేశిస్తారు. అలాంటి సమయంలో పుష్కరస్నానం విశేషమైన ఫలితాలను కలిగిస్తుంది. అందుకే పుష్కరాల్లో స్నానం ఆచరిస్తే మూడున్నర కోట్ల అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. అంతే కాదు మూడున్నర కోట్ల పుణ్యతీర్థాల్లో చేసిన ఫలితం ఒక్క గంగా పుష్కరంతోనే సాధ్యమవుతుంది.