BigTV English

Revanth Reddy: కేసీఆర్‌కు టన్నుల్లో భయం?.. రేవంత్ చుట్టూనే రాజకీయం!

Revanth Reddy: కేసీఆర్‌కు టన్నుల్లో భయం?.. రేవంత్ చుట్టూనే రాజకీయం!
REVANTH REDDY VS KCR

Revanth Reddy vs CM KCR News(Telangana politics): నిండుచంద్రుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు. నేను ఒక్కడిని ఒకవైపు.. లోకం ఒకవైపు. మహేశ్‌బాబు సినిమాలో ఓ సాంగ్‌లో ఉంటుందీ లైన్. రాజకీయాల్లో సూపర్‌స్టార్‌గా మారారు రేవంత్‌రెడ్డి. ఇటు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఒకవైపు.. మిగతా సీనియర్లు ఒకవైపు. అటు, తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌రెడ్డి ఒకవైపు.. బీఆర్ఎస్, బీజేపీ ఒకవైపు..అన్నట్టు సాగుతోంది రణరంగం.


కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. వెంటనే బీఆర్ఎస్ ఉలిక్కిపడింది. సీఎం కేసీఆరే నేరుగా రంగంలోకి దిగారు. ఏ సభ పెట్టినా ధరణి టాపికే తీస్తున్నారు. రైతులను రెచ్చగొడుతూ.. కాంగ్రెస్‌నే బంగాళాఖాతంలో కలపాలని పిలుపు ఇస్తున్నారు. బండి సంజయ్ సైతం స్పందించి.. ధరణిని అలానే కొనసాగిస్తామంటే.. జేపీ నడ్డా మాత్రం ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు. ఇలా రేవంత్ డైలాగ్ మిగతా పార్టీల్లో ప్రకంపణలు రేపింది. ఎందుకు?

కట్ చేస్తే.. లేటెస్ట్‌గా రైతులకు ఉచిత కరెంట్ ఇష్యూని రగిలిచ్చారు గులాబీ బాస్. ఎక్కడో అమెరికాలో రేవంత్ ఏదో అన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఇంకేదో అన్నారంటూ రచ్చ రచ్చ చేస్తోంది. కమిషన్ల కోసమే 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారని.. సాధారణ రైతులకు 3 గంటల ఉచిత కరెంట్ ఇస్తే చాలని రేవంత్ అంటే.. అదిగో ఉచిత కరెంట్ ఎత్తేస్తారట.. 3 గంటలే కరెంట్ ఇస్తారట.. అంటూ గులాబీ శ్రేణులు రోడ్డెక్కి నానా హంగామా చేస్తున్నాయి. ధర్నాలు, ఆందోళనలతో పొలిటికల్ మైలేజ్ కోసం బాగా ట్రై చేస్తున్నాయి.


అప్పుడు ధరణి.. ఇప్పుడు ఉచిత కరెంట్. రేవంత్ అన్నదేంటి.. బీఆర్ఎస్ చేస్తున్నదేంటి? కావాలనే రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారనే విషయం ఇట్టే అర్థమైపోతోంది. ఎందుకు? అంటే.. రేవంత్‌ పట్ల ఉన్న భయమే వారితో అలా చేయిస్తోందని అంటున్నారు.

రేవంత్‌రెడ్డి విమర్శలు ఒకఎత్తు.. మిగతా లీడర్ల మాటలు ఒకఎత్తు. రేవంత్ డైలాగులకు టన్నులకు టన్నులు వెయిట్ ఉంటుంది. ఆయన చేసే విమర్శ కానీ, ఆరోపణ కానీ.. నేరుగా ప్రజల మెదల్లోకి చొచ్చుకెళ్లుతుంది. వారిని ఆలోచింప చేస్తుంది. అందుకే, రేవంత్ నోటి నుంచి వచ్చే ప్రతీ డైలాగ్.. డైనమైట్లలా పేలుతుంది. ఆ భయమే ప్రత్యర్థి పార్టీలను కంగారులో పడేస్తోంది. కౌంటర్ పాలిటిక్స్ చేయకపోతే.. నిండా మునిగిపోతామని గుర్తించే.. గుడ్డు మీద ఈకలు పీకే రాజకీయాలకు తెర తీస్తున్నాయి.

ధరణిపై ఎలా లబోదిబో మొత్తుకున్నారో.. రైతులకు ఉచిత విద్యుత్‌పైనా.. అనని మాటలను అన్నట్టుగా వైరల్ చేస్తూ.. గులాబీ దండు అంతా రోడ్డెక్కి లొల్లి లొల్లి చేయడం.. అంతా రేవంత్‌ను కార్నర్ చేసేందుకే అనే లాజిక్ సామాన్యులూ పసిగడుతున్నారు.

కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ గ్రాఫ్ డౌన్ అయింది. ఇటీవల కేసీఆర్ చేయించిన ఇంటర్నల్ సర్వేలలో కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉందని తేలింది. అందుకే, కేసీఆర్.. హస్తం పార్టీని బద్నామ్ చేసే పాలి-ట్రిక్స్ షురూ చేశారని అంటున్నారు. ఉచిత కరెంట్ కమిషన్లపై మాట్లాడితే దానిపై స్పందించకుండా.. రైతులను రెచ్చగొట్టేలా ఆందోళనలు చేపట్టడానికి.. గులాబీ పార్టీలోని గుబులే కారణమని చెబుతున్నారు. అందుకే, 3 గంటలు అంటూ కల్వకుంట్ల అన్నాచెల్లెళ్ల ప్రచారంపై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఎంత దుష్ప్రచారం చేసినా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కల్లేనన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేదీ కాంగ్రెస్సే అంటూ తేల్చిచెబుతున్నారు రేవంత్‌రెడ్డి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×