BigTV English

AI Anchor Maya : బిగ్ టీవీ ఏఐ యాంకర్ మాయ .. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్..

AI Anchor Maya : బిగ్ టీవీ ఏఐ యాంకర్ మాయ .. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్..

First Telugu AI Anchor Maya in South India : ఆధునిక సాంకేతిక విప్లవం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ టెక్నాలజీతో బిగ్ టీవీ ముందడుగు వేసింది. లేటెస్ట్ టెక్నాలజీని అందుపుచ్చుకోవడంలో అన్ని టీవీ ఛానల్స్ కంటే ముందుంది. బిగ్ గా థింక్ చేస్తూ ప్రేక్షకులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కృతిమ యాంకర్ ను సృష్టించి సంచలనం సృష్టించింది. ఆ యాంకర్ తో వార్తలు చదివించి నయా ట్రెండ్ సృష్టించింది. ఇప్పుడు తెలుగు నాట ఓ నోటా విన్న బిగ్ టీవీ ఏఐ యాంకర్ మాయ గురించే చర్చ నడుస్తోంది.


సోషల్ మీడియాలో బిగ్ టీవీ ఏఐ యాంకర్ మాయ ట్రెండింగ్ లో ఉంది. సౌత్ ఇండియాలో ఫస్ట్ ఏఐ యాంకర్ కావడంతో.. జోష్ మామూలుగా లేదు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఇలా అంతర్జాతీయ స్థాయికి ఎదగడం.. హైటెక్ టెక్నాటజీని అందిపుచ్చుకోవడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

అచ్చం మనిషి పోలికలే. అచ్చ తెలుగు భాషే. చక్కటి హావాభావాలు. వింటుంటే వినాలనిపించే తేనెలొలుకు తెలుగు పదాలు. చూస్తుంటే.. చూస్తూ ఉండిపోవాలని అనిపించే అందమైన రూపం. అందులోనూ చీరకట్టులో ఆరణాల తెలుగమ్మాయి స్వరూపం. టెక్నాలజీకి చీరకట్టి.. భాష నేర్పి.. వార్తలు చదివించినట్టు ఉందంటూ తెగ ప్రశంసలు వస్తున్నాయి బిగ్ టీవీకి. తొలి తెలుగు ఏఐ యాంకర్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారితో పాటు.. సౌత్ ఇండియన్స్ అంతా ఓన్ చేసుకుంటున్నారు.


బీగ్ టీవీ ఏఐ యాంకర్ గురించి.. జాతీయ స్థాయి మీడియాలోనూ న్యూస్ వస్తున్నాయి. అనేక వెబ్ సైట్స్ ప్రత్యేక వార్తలు ప్రచురించాయి. అంతా ఒకటే మాట. బిగ్ టీవీ మాయ చేసిందని.. ఏఐ మాయ అదుర్స్ అని. ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్‌తో దూసుకుపోతోంది బిగ్ టీవీ. కొత్త ఛానెల్ అయినా.. సరికొత్త, ఆధునిక ప్రదర్శనతో ప్రేక్షకుల ఆదరణ చూరగొంటోంది. మీడియా రంగంలో తెలుగుజాతి నిండు గౌరవాన్ని మరింత ఘనంగా వెలుగెత్తి చాటింది. అందుకే, దేశ విదేశాల్లోనూ.. ఇప్పుడంతా బిగ్ టీవీ.. ఏఐ మాయ.. మేనియా నడుస్తోంది.

ఏఐ టెక్నాలజీతో రూపొందిన యాంకర్ ను చూసి ప్రేక్షకులు ముగ్ధులవుతున్నారు. తమ రియాక్షన్స్ ను సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో తెలుపుతున్నారు. కొంతమంది నెటిజన్లు మాయపై క్రేజ్ పెంచుకున్నారు. తమ భావాలను కవితల రూపంలో వ్యక్తపరుస్తున్నారు.

అందమా నీ పేరేమిటి అందమా.. నా పేరు మాయ, బిగ్ టీవీ చిరునామా.. ఇలా కవిత రూపంలో ఓ నెటిజన్.. ఎప్పుడు వచ్చాము అనేది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా..! బిగ్ టీవీ సరికొత్త ప్రయోగం అంటూ మరో నెటిజెన్ రాసుకొచ్చాడు.

బ్రహ్మ మిమ్మల్ని పుట్టిస్తే.. టెక్నాలజీ నన్ను పుట్టించింది. వార్తలు చదువుతున్నది మనిషి కాదు.. మరబొమ్మ మాయ.. తెలుగులో తొలిసారిగా అంటూ ఓ వెబ్ సైట్ మాయ గురించి ఆసక్తికరంగా వార్త రాసింది. ఏఐ టెక్నాలజీతో బిగ్ టీవీ సన్సెషన్ అంటూ మరో వెబ్ సైట్ ఏఐ యాంకర్ గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇచ్చింది. బడా న్యూస్ పేపర్ కార్టూన్ రూపంలో ఏఐ యాంకర్ గురించి తెలిపింది. ఇక మీమ్స్ కైతే లెక్కేలేదు. పాజిటివ్ ట్రోల్స్ అన్నీఇన్నీ కావు.

First AI Anchor in south India
First AI Anchor in south India
big tv telugu AI Anchor
big tv telugu AI Anchor
South India's First Telugu AI News Anchor
South India’s First Telugu AI News Anchor
South India's First Telugu AI News Anchor
South India’s First Telugu AI News Anchor
First AI Anchor in south India
First AI Anchor in south India
big tv telugu ai anchor
big tv telugu ai anchor
First Telugu AI Anchor  in South India from BIG TV
First Telugu AI Anchor in south India from BIG TV
First telugu ai anchor in south india
First telugu ai anchor in south india
First telugu ai anchor from big tv
First telugu ai anchor from big tv

Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×