BigTV English

India Vs West Indies : అశ్విన్, జడేజా మాయాజాలం.. విండీస్ విలవిల..

India Vs West Indies : అశ్విన్, జడేజా మాయాజాలం.. విండీస్ విలవిల..

India Vs West Indies : వెస్టిండీస్ తో జరుగుతున్న తొలిటెస్టులో తొలిరోజు టీమిండియా ఆధిపత్యం సాధించింది. టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న విండీస్ కు భారత్ బౌలర్లు చుక్కులు చూపించారు. ముఖ్యంగా స్పిన్నర్లు అశ్విన్ , జడేజా మాయాజాలానికి విండీస్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో విండీస్ 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తొలిటెస్టు ఆడుతున్న అథనజే 47 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో ఒక్కరు కూడా 20 పరుగులు దాటలేదు. భారత్ బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లు, జడేజా 3 వికెట్లు, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.


విండీస్ ఆలౌట్ కాగానే బ్యాటింగ్ కు దిగిన భారత్ తొలి రోజు వికెట్ కోల్పోకుండా 80 పరుగులు చేసింది. తొలి టెస్టు ఆడుతున్న యశస్వి జైస్వాల్ ఆకట్టుకున్నాడు. 6 ఫోర్లతో 40 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 30 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అటు బౌలర్లు చెలరేగడం, ఇటు ఓపెనర్లు రాణించడంతో తొలిరోజు భారత్ పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. రెండోరోజు బ్యాటర్లు చెలరేగితే ఈ మ్యాచ్ పై పూర్తిగా పట్టుసాధిస్తుంది.

ఈ మ్యాచ్ లో అశ్విన్ అరుదైన ఘనతలు సాధించాడు. టెస్టుల్లో తండ్రీకొడుకులను అవుట్ చేసిన ఐదో బౌలర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో విండీస్ బ్యాటర్ త్యాగ్ నారాయణ్ చందర్ పాల్ ను అశ్విన్ బౌల్డ్ చేశాడు. 2011లో ఢిల్లీ టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన అశ్విన్.. ఆ మ్యాచ్ లో త్యాగ్ నారాయణ్ తండ్రి శివ్ నారాయణ్ చందర్ పాల్ ను ఔట్ చేశాడు. ఇదే విధంగా ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ , దక్షిణాఫ్రికా బౌలర్ల సిమోన్ హర్మన్ కూడా త్యాగ్ నారాయణ్, శివ్ నారాయణ్ లను ఔట్ చేశారు.


అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ లో 700 వికెట్ల క్లబ్ లో చేరాడు. భారత్ బౌలర్లలో అనిల్ కుంబ్లే 953 వికెట్లు తీసి టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత హర్భజన్ సింగ్ 707 వికెట్లతో 2వ స్థానంలో ఉన్నాడు. అశ్విన్ ఇదే జోరు కొనసాగిస్తే ఈ సిరీస్ లోనే హర్భజన్ ను దాటేస్తాడు.

Related News

Team India: టీమిండియా ప్లేయర్ పై టాలీవుడ్ ఆంటీ కన్ను.. ?

Vaibhav SuryaVamshi : వైభవ్ సూర్య వంశీపై దారుణంగా ట్రోలింగ్…సంక్రాంతికి వస్తున్నాం బుడ్డోడు అంటూ

Harry Brook: క్రికెట్ లోనే తొలిసారి… సరికొత్త షాట్ కనిపెట్టిన హ్యారీ బ్రూక్.. ఇది చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

Triple H: బికినీలో ప్రియురాలు… ట్రిపుల్ హెచ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి

Irfan Pathan : ధోనీ వల్లనే జట్టులో చోటు కోల్పోయా.. ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు

Akash Deep : కొత్త కారు కొన్న ఆకాష్ దీప్ కు నోటీసులు.. కారణం ఇదే..!

Big Stories

×