E-Paper
Advertisement

Revanth Reddy Mania | రేవంత్ రెడ్డి మేనియా.. కేసీఆర్ నోట కూడా అదే పేరు!

Revanth Reddy Mania | ఇప్పుడు రాష్ట్రమంత్రా రేవంత్ రెడ్డి మేనియా కనిపిస్తోంది. ఇంటికి క్యూ కడుతున్న వారికి లెక్కలేదు. ఎక్కడ చూసినా రేవంత్ సీఎం సీఎం అన్న నినాదాలే వినిపిస్తున్నాయి.

Revanth Reddy Mania | రేవంత్ రెడ్డి మేనియా.. కేసీఆర్ నోట కూడా అదే పేరు!

Revanth Reddy Mania | ఇప్పుడు రాష్ట్రమంత్రా రేవంత్ రెడ్డి మేనియా కనిపిస్తోంది. ఇంటికి క్యూ కడుతున్న వారికి లెక్కలేదు. ఎక్కడ చూసినా రేవంత్ సీఎం సీఎం అన్న నినాదాలే వినిపిస్తున్నాయి. పైకి హైకమాండ్ దే నిర్ణయమని రేవంత్ చెబుతున్నా.. ఈ పదవికి వందకు వందశాతం ఆయనే అర్హుడన్నది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, సాధారణ జనం చెబుతున్న మాట.

ఇదీ రేవంత్ రెడ్డి మేనియా. ఎక్కడ చూసినా.. ఎటు చూసినా సీఎం సీఎం అన్న నినాదాలే… ఈ మేనియా రాత్రికి రాత్రి వచ్చింది కాదు…

కేసీఆర్ ను ఢీ అంటే ఢీ అన్న స్థితికి తీసుకొచ్చారు రేవంత్. నిజానికి గత పదేళ్లలో కేసీఆర్ ఒక బలమైన నాయకుడిగా ఎదిగారు. మాటకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించారు. తెలంగాణ చాలదు.. ఢిల్లీని కొడుతా అని పార్టీ పేరును కూడా బీఆర్ఎస్ గా మార్చేశారు. ఆర్థికంగా రాజకీయంగా బలంగా మారిన కేసీఆర్ ను ఇప్పట్లో ఎవరూ ఢీకొడుతారని ఎవరూ అనుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం గట్టిగా అనుకున్నారు. బక్కోడు కాదు.. బకాసురుడు అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. చిన్న చిన్న బీఆర్ఎస్ నేతలను అసలు పట్టించుకోలేదు. టార్గెట్ అంతా కేసీఆరే. అందులో భాగమే ఈ పవర్ ఫుల్ స్లోగన్స్..

నిజానికి ప్రచార సభల్లో రేవంత్ పేరును తీసుకోవద్దని కేసీఆర్ అనుకున్నారట. కానీ అలా కుదరలేదు. చివరకు కేసీఆర్ కూడా రేవంత్ పేరు లేకుండా ఎక్కడా ప్రచారం చేయలేకపోయారు. కరెంట్ ఇంతే చాలు అని, పెద్ద మోటర్లు ఎవడియ్యాలే అంటూ పరుష పదజాలంతో కేసీఆర్ మాట్లాడారు. అయితే వాటన్నిటినీ బలంగా తిప్పికొట్టడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు.

రేవంత్ అంటే పేరు కాదు బ్రాండ్ అన్నంతగా మారిపోయింది. ఆ బ్రాండే.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలకమవబోతోంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రచారాన్ని భుజాన వేసుకుని హోరెత్తించారు రేవంత్. నిజానికి రాజకీయ ప్రచార సభలకు వచ్చిన వారి ఓట్లన్నీ పార్టీలకు వేయరు. కానీ రేవంత్ సభలకు వచ్చిన వారి ఓట్లన్నీ హస్తం పార్టీవైపే షిఫ్ట్ అయ్యాయన్నది నిజం. ఆ స్థాయి ఛరిష్మా సాధించారు రేవంత్. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా తన వాయిస్ వినిపించేలా చూసుకున్నారు.

తెలంగాణ పాలిటిక్స్ లో ఒకప్పుడు కేసీఆర్ కు చాలా క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఆ క్రేజ్ ను రేవంత్ రెడ్డి సొంతం చేసుకున్నారు. మేనేజ్ మెంట్ కాదు… మెరిట్ కోటాలో అదుర్స్ అనిపించారు. అందుకే ఇప్పుడు తెలంగాణ అంతటా రేవంత్ సీఎం అన్న స్లోగన్ మార్మోగుతోందంటే అది స్వయంకృషితో వచ్చిందే.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×