
Sleep cycle : రోజులో 24 గంటల పాటూ పనిచేసే జీవ గడియారం మన స్లీప్ సైకిల్‌ను నడిపిస్తుంది. దీన్నే సర్కేడియన్ రిథమ్ అంటారు. ఉదయం నిద్ర లేచినప్పుడు హుషారుగా ఉండే మనం, సాయంత్రానికి అలసటగా, రాత్రి అయితే నిద్రకు ఉపక్రమిస్తుంటాం. ఇలా ఎందుకో తెలుసా?
రాత్రి నిద్రకు చేరువయ్యే క్రమం మెదడులో ఉత్పత్తయ్యే అడినోసిన్ అనే ఆర్గానిక్ కాంపౌండ్తో లింక్ అయి ఉంటుంది. రోజు గడిచే క్రమంలో ఈ అడినోసిన్ మోతాదు క్రమేపీ పెరుగుతూ, సాయంత్రానికి అలసట ఆవరించేలా చేస్తుంది. రాత్రి నిద్రించే సమయంలో శరీరం ఈ కాంపౌండ్‌ను విరిచేస్తుంది. మన మెదడులోని కొన్ని నాడీ కణాలు కూడా సహజసిద్ధ, కృత్రిమ వెలుగులకు స్పందిస్తూ, రాత్రీపగళ్ల మధ్య తేడాను గ్రహిస్తాయి. ఇలా మన జీవ గడియారం ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ, రాత్రి నిద్రకూ, పగలు మెలకువకూ శరీరాన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది.
ఎవరికి ఎంత నిద్ర అవసరం..?