E-Paper
Advertisement

Revanth Reddy : మార్పుకావాలంటే.. కాంగ్రెస్ రావాలి.. బైబై కేసీఆర్.. రేవంత్ న్యూ స్లోగన్..

Revanth Reddy : మార్పుకావాలంటే.. కాంగ్రెస్ రావాలి.. బైబై కేసీఆర్.. రేవంత్ న్యూ స్లోగన్..
Advertisement

Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. కల్వకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సభా వేదికపై టీపీసీసీ అధక్ష్యుడు రేవంత్ రెడ్డి కొత్త స్లోగన్ అందుకున్నారు. మార్పుకావాలంటే.. కాంగ్రె రావాలి.. బైబై కేసీఆర్ అని రేవంత్ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు మింగారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది.. సుందిళ్ల బ్యారేజ్ పగిలిందన్నారు. పని వంతుడు పందిరేస్తే కుక్కు తోక తగిలితే కూలిపోయిందట అనే సామెతను గుర్తు చేస్తూ కేసీఆర్ పై సైటర్ వేశారు.

Advertisement

తెలంగాణను కాంగ్రెస్ పార్టీనే ఇచ్చిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ తెలంగాణ తెచ్చానని చెప్పుకున్న కేసీఆర్ కు రెండు అవకాశాలు ఇచ్చారని.. అయితే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం , పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి చేయలేదని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు , దళిత బంధు, దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్న హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్ ను గెలిపిస్తే పాలమూరులో ఇంకా వలసలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. అందుకే
బీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలకుర్తికి ఎంతో ప్రత్యేకస్థానం ఉందని రేవంత్ అన్నారు. దివంగత నేత జైపాల్ రెడ్డిని గుర్తు చేశారు. ఇదే కుల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జైపాల్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారని వివరించారు. జైపాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటరీయన్ అవార్డు అందుకుని ఈ ప్రాంతం ప్రతిష్టను మరింత పెంచరన్నారు. ఈ జిల్లాలోనే పుట్టిన తాను కూడా ప్రజలు ఆదరించడం వల్ల టీపీసీసీ అధ్యక్షడిని అయ్యానని తెలిపారు. ప్రజల గెలిపించడం వల్ల ఈ స్థాయి వచ్చిందన్నారు.

Advertisement

గత ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ ను 13 సీట్లులో గెలిపిస్తే మార్పువచ్చిందా అని రేవంత్ ప్రశ్నించారు. పాలమూరులో 14 స్థానాల్లోనూ ఇప్పుడు కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. రైతులు నీళ్లు ఇస్తామన్నారు. కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణరెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. వార్డు మెంబర్ పదవిని కూడా నేడు ఎవరూ వదులుకోరని కానీ వంశీచందర్ రెడ్డి ఇక్కడ టిక్కెట్ త్యాగం చేశారని ప్రశంసించారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×