E-Paper
Advertisement

Revanth Tweet : “జనమే నా సైన్యం.. వారి అభిమానమే నా ఆయుధం”

Revanth Tweet : “జనమే నా సైన్యం.. వారి అభిమానమే నా ఆయుధం”

Revanth Tweet : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గురించి ట్వీట్ చేసారు. ఎవరినైనా నమ్మితే తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని ఆయన తెలిపారు. నయవంచన చేసినవాడికి తగిన గుణపాఠం చెప్పాలని అందుకోసం తాను యుద్ధం చేస్తునట్టు తెలిపారు. ఈ యుద్ధంలో జనమే తన సైన్యం అని.. వారి అభిమానమే ఆయుధమని పేర్కొన్నారు. తెలంగాణ గెలుపు కోసం తన జీవితాన్ని అంకితమిస్తానని అన్నారు.

తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి అమరుడైన గద్దర్ కుమార్తె వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు కేటాయించడంతో తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని వెన్నెల మర్యాదపూర్వకంగా కలిశారు. కంటోన్మెంట్ సీటు తనకి కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

కంటోన్మెంట్ ప్రజలు తనని ఆదరిస్తారని ఆమె అన్నారు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని ప్రచారానికి రావాలని ఆహ్వానించినట్టు ఈ సందర్బంగా ఆమె తెలిపారు. తెలంగాణాలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని ఆమె ఈ సందర్భంగా అన్నారు. కాగా వెన్నెల కాంగ్రెస్‌లో చేరకముందే ఆమెకు ఆ పార్టీ టికెట్ కేటాయించడం గమనార్హం.

Tags

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×