E-Paper
Advertisement

Matthew Perry : అనుమానాస్పద స్థితిలో నటుడు మృతి.. ప్రముఖుల సంతాపం

Matthew Perry : అనుమానాస్పద స్థితిలో నటుడు మృతి.. ప్రముఖుల సంతాపం
Advertisement

Matthew Perry : హాలీవుడ్ సీనియర్ నటుడు, ఒకప్పటి ఫేమస్ నటుడు మాథ్యూపెర్రీ(54) అనుమానాస్పద స్థితిలో మరణించారు. అనేక సినిమాలు, టీవీ షోలతో ప్రేక్షకులకు దగ్గరైన మాథ్యూ పెర్రీ.. టెలివిజన్ సిరీస్ అయిన ఫ్రెండ్స్ లో చాండ్లర్ బింగ్ అనే పాత్రతో అందరినీ ఆకట్టుకున్నాడు. 10 ఏళ్ల పాటు కొనసాగిన ఈ సిరీస్ ద్వారానే మాథ్యూ పెర్రీ ఇండియా ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.

కొన్నాళ్లు మాథ్యూ సినిమాలకు, టెలివిజన్ కు కూడా పూర్తిగా దూరంగా ఉంటున్నారు. డ్రగ్స్ కు బానిసైన ఆయన.. ఆ ఊబిలో నుంచి బయటికొచ్చేందుకు చాలా కష్టపడ్డారు. అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమైన మాథ్యూ.. అక్టోబర్ 28న లాస్ ఏంజిల్స్ లోని బాత్ టబ్ లో అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కనిపించారు. మాథ్యూకి తోడుగా ఉండే అసిస్టెంట్.. బయటికెళ్లి వచ్చాక ఈ ఘటన చూసి ఎమర్జెన్సీ నంబర్ కు కాల్ చేసి విషయం చెప్పాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు, అంబులెన్స్ వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు చెప్పారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాథ్యూపెర్రీ మరణవార్తలో పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×