BigTV English

Weather Updates : వానలు పోయి ఎండలు వచ్చే.. సుర్రో సుర్రు..

Weather Updates :  వానలు పోయి ఎండలు వచ్చే.. సుర్రో సుర్రు..
Weather Updates in Telangana & AP


Weather Updates in Telangana & AP(Today news paper telugu): మొన్నటిదాకా ఫుల్ వానలు. గ్యాప్ లేకుండా రోజుల తరబడి నాన్‌స్టాప్ వర్షం కురిసింది. వరద వెల్లువెత్తింది. తెలంగాణలో మునుపెన్నడూ లేనంత రికార్డు వర్షపాతం పడింది. అంతా ఆగమాగం చేసిపడేసింది. ఆ వరద ఇంకా వదల్లేదు. ఆ బురద ఇంకా పోలేదు. వానలు ఇలా తగ్గాయో లేదో.. అలా బాణుడు ఎంట్రీ ఇచ్చేశాడు. ఎండతో సుర్రు మనిపిస్తున్నాడు.

వానలు పడటానికి ముందు ఎండ ఏ రేంజ్‌లో ఉందో.. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో వేడి మండిపోతోంది. వర్షాకాలంలోనూ ఎండాకాలాన్ని గుర్తు చేస్తోంది. వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రుతుపవన మేఘాలు సైడ్ అయిపోవడంతో.. సూర్యుడి కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. సుర్రో సుర్రుమనిపిస్తున్నాయి.


తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్ధితులు నెలకొన్నాయి. వర్షాకాలంలోను ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. వేసవిని తలిపించేలా నమోదు అవుతున్నాయి ఉష్ణోగత్రలు. ఏపీలో పలుచోట్ల పగటిపూట 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అల్లూరి, విశాఖ, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, గుంటూర్, విజయనగరం జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ ఎండలు గట్టిగానే కొడుతున్నాయి. పలు జిల్లాల్లో 40కి చేరువవుతోంది టెంపరేచర్.

ప్రస్తుతం సమ్మర్‌ మాన్‌సూన్‌ నడుస్తోందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆకాశంలో క్లౌడ్స్ ఉన్న సమయంలో చల్లని వాతావరణం ఉంటుందని.. క్లియర్ స్కై ఉంటే ఎండల తీవత్ర ఎక్కువగానే ఉంటుందని వివరిస్తున్నారు. అర్బన్‌ ఏరియాలో వాతావరణంలో మార్పులు.. గ్లోబల్ వార్మింగ్‌తోనే అనుహ్యా మార్పులు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు. అర్బన్‌ ప్రాంతాల్లో వాహన, పరిశ్రమల కాలుష్యం.. వాతావరణ సమత్యులతను దెబ్బతీస్తోందని చెబుతున్నారు.

Related News

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: లిక్కర్ కేసులో కొత్త విషయాలు.. ముడుపుల చేర్చడంలో వారే కీలకం, బిగ్‌బాస్ చుట్టూ ఉచ్చు

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Big Stories

×