BigTV English

Shruti Haasan: రజినీ కూతురిగా మారిన కమల్ కూతురు..?

Shruti Haasan: రజినీ కూతురిగా మారిన కమల్ కూతురు..?

Shruti Haasan:కోలీవుడ్ హాట్ బ్యూటీ శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఈ మధ్యనే లోకేష్ కనగరాజ్ ను తన మ్యూజిక్ ఆల్బమ్ తో హీరోగా కూడా మార్చింది. ఒకపక్క సినిమాలు, ఇంకోపక్క సంగీతంతో అమ్మడు బుజ్య్ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే శృతి మరో పెద్ద ఆఫర్ ను పట్టేసినట్లు తెలుస్తోంది. అదే తలైవర్ 171. 60 ఏళ్లు దాటినా కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీగా నిలబడుతున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. టి. జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో వేట్టాయన్ సినిమా చేస్తున్నాడు.


ఇది కాకుండా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలైవర్ 171 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే లోకేష్.. కమల్ కు విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించాడు. ఇక ఇప్పుడు రజినీ వంతు. దీని కోసం మనోడు చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజినీ కూతురుగా శృతి హాసన్ ఎంపిక అయ్యిందని తెలుస్తోంది. సినిమా మొత్తం తండ్రి కూతుళ్ల అనుబంధంలోనే నడుస్తుంది అంట. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమా కావడంతో శృతి కూడా ఓకే చెప్పిందని టాక్.

ఇంకా చెప్పాలంటే.. శృతికి ఇదొక మంచి అవకాశం. ఆమె హీరోయిన్ గా హీరోలతో చేయడమే కానీ, ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేసింది లేదు. కమల్ తో కలిసి ఇలాంటి సినిమా చేయడానికి ప్రయత్నించింది కానీ, అది వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక తండ్రితో అవ్వలేదు కాబట్టి రజినీకి కూతురుగా నటించి ఆ కోరికను తీర్చుకుంటున్నదన్నమాట. ఇకపోతే ఈ చిత్రానికి కళుగు అనే టైటిల్ ను అనుకుంటున్నారట. ఇందులో రజినీ గోల్డ్ స్మగ్లర్ గా కనిపినించబోతున్నాడు. మరి ఈ సినిమాతో శృతి, రజినీ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.


Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×