Big Stories

Wine shops rush: రద్దీగా వైన్ షాపులు, 24 గంటలపాటు బంద్

Wine shops rush: హైదరాబాద్‌లో వైన్ షాపులు బిజిబిజీగా మారుతున్నాయి. మందుబాబులతో ఆయా షాపుల వద్ద రద్దీ నెలకొంది. ఈనెల 17న అంటే బుధవారం శ్రీరామనవమి సందర్భంగా 24 గంటలపాటు వైన్ షాపులు మూసి వేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతా ల్లో షాపులు బిజీగా మారాయి. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి గురువారం ఉదయం ఆరు వరకు వైన్, కల్లు, బార్లు మూసి వేయాలని తెలిపారు. ఎవరైనా తెరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -

వైన్ షాపులు బంద్ అని తెలియడంతో ముందుబాబులు ముందుగానే తరలి వస్తున్నారు. పలు చోట్ల రద్దీ నెలకొంది. అసలే ఎండాకాలం ఆపై బీర్లకు డిమాండ్ పెరిగింది. మద్యం పాపుల్లో వీటి కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. కావాల్సిన బ్రాండ్ బీర్లు దొరకలేదని చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేకపోవడం దీనికి కారణమని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు బ్రూవరీల్లో రోజుకు రెండున్నర లక్షల కేసుల బీర్లు సరకు మార్కెట్లోకి రావాలి. ప్రస్తుతానికి లక్షన్నర మాత్రమే బీర్లు అందుబాటులోకి వస్తున్నాయని  చెబుతున్నారు.

- Advertisement -

ALSO READ: వీడు మామూలోడు కాదు.. మిడ్ నైట్‌లో ఏకంగా గంటలో ఆరు..!

ఇటీవల హోలీ ఫెస్టివల్ సమయంలోనూ వైన్స్ షాపులు బంద్ అయ్యాయి. హిందువులకు అత్యంత ముఖ్యమైన పర్వదినాల్లో శ్రీరామనవమి కూడా ఒకటి. దేశవ్యాప్తంగా శ్రీరాముని వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. అయితే ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేయనుంది. అయితే ఈ నిషేధం కేవలం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషరేట్ల పరిధిలో మాత్రమే విధించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News