E-Paper
Advertisement

Sejal: కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. శేజల్ వదిలేదేలే.. దుర్గంకు చుక్కలే..

Sejal: కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. శేజల్ వదిలేదేలే.. దుర్గంకు చుక్కలే..
Advertisement
sejal

Sejal durgam chinnaiah latest news(Telangana today news): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా ఢిల్లీలో తన పోరాటాన్ని కొనసాగిస్తోంది బాధితురాలు శేజల్. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వద్ద సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసింది. దశాబ్ది వేడుకల భాగంగా నేడు మహిళ సంక్షేమం దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకం చేశానంది శేజల్. మహిళల కోసం ఎంతో చేసిన సీఎం.. తనకు కూడా న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్నానని తెలిపింది.

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆయనకి సహకరించిన పోలీసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది శేజల్. న్యాయం చేయాలని వెళ్తే ఎమ్మెల్యే దగ్గరకు వెళితే పనైపోతుందని తనపైనే ఒత్తిడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తక్షణమే వారందరిపై కిడ్నాప్, మహిళలను వేధించిన కేసులు పెట్టాలని డిమాండ్ చేసింది శేజల్.

Advertisement

తనను లైంగికంగా వేధించాడంటూ గత కొద్ది రోజులుగా దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తోన్న ఆరిజిన్ డెయిరీ ఎండీ
శేజల్.. ఇప్పటికే సీబీఐని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారంపై దర్యాప్తు చేసి.. తనకు న్యాయం చేయాలని సీబీఐకి విజ్ఞప్తి చేసింది శేజల్‌. తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

దాదాపు పది రోజులకు పైగా ఢిల్లీలోనే ఉంటున్నారు ఆరిజన్ డెయిరీ ఎండీ శేజల్. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. తనకు న్యాయం జరగడం లేదనే ఆవేనదతో న్యూఢిల్లీలోనే ఆత్మాహత్యాయత్నం చేసింది శేజల్‌. వెంటనే స్థానికులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. ఇటీవలే ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ అయ్యారు.

Advertisement

దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మహిళ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసింది శేజల్‌. శేజల్‌ ఫిర్యాదుతో జాతీయ మహిళా కమిషన్‌ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. 15 రోజుల్లో విచారణ నివేదికను పంపాలని ఆదేశించింది జాతీయ మహిళా కమిషన్‌.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×