BigTV English

Phone Tapping Case: మొత్తం 650 మంది ఫోన్లు ట్యాప్.. ప్రభాకర్ రావు విచారణలో సంచలన నిజాలు

Phone Tapping Case: మొత్తం 650 మంది ఫోన్లు ట్యాప్.. ప్రభాకర్ రావు విచారణలో సంచలన నిజాలు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఏ1 ప్రభాకర్ రావు అమెరికా నుంచి భారత్‌కు రావడంతో.. విచారణ జెట్ స్పీడ్‌లో కొనసాగుతుంది. ఇప్పటికే పలుమార్లు సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు.. గురువారం మరోసాని విచారణకు వెళ్లారు. దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు సిట్ అధికారులు. మావోయిస్టుల సానుభూతిపరులని వందల మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు గుర్తించారు. అయితే ఆ లిస్ట్ లో ఒక్కరిపై కూడా కేసులు నమోదు కాలేదు. అప్పుడు మావోయిస్టు సానుభూతిపరులు ఎలా అవుతారంటూ ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు బాధితుల నుంచి సిట్ అధికారులు వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. మరికొంతమందిని విచారించారు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి సిట్‌ ముందుకు వెళ్లనున్నారు ప్రభాకర్ రావు.


ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు

2023 నవంబర్ 15న 650 మంది ఫోన్లు ట్యాప్ చేసిన వ్యవహారంపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్ట్ సానుభూతిపరుల పేరుతో రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. పదవీ విరమణ పొందిన తర్వాత.. ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్ రావును.. గత ప్రభుత్వ హయాంలో.. ఫోన్ లీగల్ ఇంటర్ సెప్షన్ డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించడంపైనా సిట్ విచారిస్తోంది. డిజిగ్నేటెడ్ అథారిటీ హోదాలో కేవలం.. 7 రోజలు మాత్రమే అనుమానిత ఫోన్లపై నిఘా పెట్టాలి. 7 రోజుల తర్వాత ఫోన్ కాల్స్‌పై నిఘా పెట్టాలంటే.. రివ్యూ కమిటీ అనుమతి పొందాలి. కానీ గడువు ముగిసినా.. ఎలాంటి అనుమతులు లేకుండా.. ఇష్టమొచ్చినట్లుగా.. చట్ట విరుద్ధంగా ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు.


నిందితులు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా విచారణ

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులు, బాధితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. ఇప్పటికే.. 650 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో వారు ఇబ్బందులకు గురైన తీరుపై ఆయనేం చెబుతారన్నది నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.

దర్యాప్తు బృందం ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పని ప్రభాకర్ రావు

ప్రభాకర్ రావు విషయంలో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన విచారణకు సహకరించక పోవడం వల్ల.. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. ఆయనకు ఇచ్చిన రిలీఫ్‌ని రద్దు చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. త్వరలోనే.. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ స్టేట్‌మెంట్‌ని కూడా పోలీసులు నమోదు చేయనున్నారు.

ప్రభాకర్ రావు టీం వందల పెన్ డ్రైవ్స్ కొనుగోలు చేసి..

ప్రభాకర్ రావు టీం వందల పెన్ డ్రైవ్స్ కొనుగోలు చేసి కాల్స్ రికార్డ్ చేసి వాటిని కాపీ చేసి కావలసిన వారికి ఇచ్చినట్టు సిట్ గుర్తించింది. ఆ పెన్ డ్రైవ్ లు ఎవరెవరికి ఇచ్చారనే దానిపై ప్రభాకరావ్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో ఆ పెన్ డ్రైవ్ లు దొరికితే కీలక సాక్ష్యాలుగా మారనున్నాయి.

ప్రభాకర్‌రావు విచారణకు సహకరించకపోతే సుప్రీంను ఆశ్రయించనున్న సిట్‌

ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకున్న రిలీఫ్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్ట్‌ను కోరనున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే ప్రభాకర్ రావు వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన అధికారులు ఆయన ఇచ్చిన కీ డీటెయిల్స్ ఆధారంగా ప్రణీత్ రావును విచారించారు.

Also Read: ట్రయాంగిల్ వాటర్ వార్..? బనకచర్ల వివాదం ఏంటంటే..! తెలంగాణ వాటా ఎంతంటే..?

కొట్టివేయాలని కోరనున్న సిట్ బృందం

అటు ఫోన్ ట్యాపింగ్ మంటలు ఏపీని చుట్టేశాయి. వైవీ సుబ్బారెడ్డి వద్ద ట్యాప్ అయిన తన ఆడియో ఉందని బాంబు పేల్చారు షర్మిల. ఈ విషయం నిజమో కాదో తన కుటుంబసభ్యుల మీద ప్రమాణం చేసి చెప్పాలని డిమాండ్ చేశారు. వైవీ చేతికి ఆ ఆడియో ఎలా వచ్చింది? వైవీని విచారణకు పిలిస్తే అసలు విషయాలు వెలుగుచూస్తాయని షర్మిల డిమాండ్ చేశారు.

Related News

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Mallareddy: మల్లారెడ్డి యూటర్న్.. రాజకీయాల్లో నో రిటైర్మెంట్

Telangana rains: మళ్ళీ ముంచెత్తనున్న వర్షాలు.. ఆగస్టు 14 నుండి 17 వరకు జాగ్రత్త!

Big Stories

×