BigTV English

Another shock to BRS: బీఆర్ఎస్‌కు గట్టి షాక్, సొంతింటికి బస్వరాజు, మరో ఇద్దరు కూడా..

Another shock to BRS: బీఆర్ఎస్‌కు గట్టి షాక్, సొంతింటికి బస్వరాజు, మరో ఇద్దరు కూడా..

BRS party latest news(Telangana politics): తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు ముందే కారు పార్టీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వైపు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లతో వాళ్లంతా మంతనాలు సాగించినట్టు సమాచారం. వీలు కుదిరితే రేపోమాపో ఆ ముగ్గురు కాంగ్రెస్‌లో జాయిన్ కావడం ఖాయంగా తెలుస్తోంది.


సీనియర్లు, కీలక నేతలు వలసతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది బీఆర్ఎస్ పార్టీ. రోజుకో నేత కారు నుంచి దిగి పోతుండడంతో ఆ పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా మొదలైంది. తాజాగా బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కారు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు వార్తలు జోరందుకున్నాయి. కీలక నేతలతో ఆయన మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పెద్దలు సానుకూలంగా స్పందించడంతో ఆయన రేపో మాపో సొంతగూటికి చేరడం ఖాయమని అంటున్నారు.

శనివారం సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ పర్యటకు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సమావేశమైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆయనతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.


ALSO READ:  కరీంనగర్, వరంగల్ ప్రజలకు శుభవార్త.. సీఎం రేవంత్​ రెడ్డి చొరవతో స్పందించిన కేంద్రం

నార్మల్‌గా బస్వరాజు సారయ్య కాంగ్రెస్ వాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కిరణ్‌‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పని చేశారు. విభజన తర్వాత నేతలు వలస పోవడంతో 2016లో సారయ్య బీఆర్ఎస్‌లో చేరిపోయారు. కొన్నాళ్ల తర్వాత కారు పార్టీ.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తనకున్న పరిచయాలతో కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడారు.

Tags

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×