BigTV English

T20 World Cup : 16 ఏళ్లు కప్ కోసం చూశాం.. కాసేపు ట్రాఫిక్ లో ఉండలేమా ?

T20 World Cup : 16 ఏళ్లు కప్ కోసం చూశాం.. కాసేపు ట్రాఫిక్ లో ఉండలేమా ?

Delhi Police Tweet After India Won the T20 World Cup : టీ 20 ప్రపంచకప్ ను టీమిండియా గెలిచిన ఆనందం రకరకాలుగా వ్యక్తమవుతోంది. ఈ మంచి సమయాన్ని అందిపుచ్చుకుని పోలీసులు వినూత్నంగా ఒక ప్రచారం మొదలుపెట్టారు. నిజానికి ట్రాఫిక్ రూల్స్, ప్రమాదాలపై వాళ్లు ఎన్నెన్నో అవగాహన కార్యక్రమాలు పెడుతుంటారు. అలా టీ 20 ప్రపంచకప్ జోష్ ని కూడా అందిపుచ్చుకున్నారు. కోట్లాదిమంది యువత, ప్రజలు కూడా వరల్డ్ కప్ ఫీవర్ లో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఏం చెప్పినా వింటారని భావించి కొన్ని ట్రాఫిక్ కొటేషన్స్ వదిలారు. అలాంటివాటిలో కొన్ని వైరల్ అవుతున్నాయి. మరి అవేమిటో చూద్దాం.


భారత్ టీ 20 వరల్డ్ కప్ గెలిచేందుకు సరిగ్గా 16 ఏళ్ల 9 నెలల 5 రోజులు పట్టింది. 52 కోట్ల 70 లక్షల 40 వేల సెకన్లు పట్టింది. అంటే అంతసేపు మనందరం వేచి చూశాం. మరి ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఒక్క రెండు నిమిషాలు ఓపికగా ఉండలేమా? అని ప్రశ్నిస్తూ కొటేషన్స్ వదిలారు. అంతేకాదు దాంతో పాటు మరికొన్ని స్ఫూర్తికరమైన మాటలు చెప్పారు.

జీవితంలో మంచి క్షణాల కోసం ఎప్పుడూ వేచి ఉండాల్సిన అవసరం ఉంది. తొందరపడితే ఇలాంటి మధురక్షణాలు మిస్ అయిపోతాం. అది క్రికెట్ మాత్రమే కాదు, జీవితంలో ఎన్నో అద్భుత క్షణాలు ఉంటాయి. వాటిని మిస్ చేసుకోవద్దని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. వాళ్లు పెట్టిన కాసేపటికే పోస్ట్ వైరల్ అయిపోయింది.


Also Read : టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ముంబయి ట్రాఫిక్ పోలీసులు అయితే IND 29, JUNE 2024 అనే నంబర్ ప్లేట్ ఉన్న కారులో రోహిత్ శర్మ ఉన్నట్టు ఫొటో ఒకటి షేర్ చేస్తూ వదిలారు. ప్రపంచ విజేత.. టీమ్ ఇండియా అని క్యాప్షన్ కూడా పెట్టారు.

ఈసారి ప్రపంచకప్ గెలవడంతో పాటు ఇద్దరు లెజండరీ క్రికెటర్లు టీ 20 ఫార్మాట్ కి దూరమైపోయారు. అంతేకాదు కోచ్ గా ద్రవిడ్ పదవీ కాలం కూడా అయిపోయింది. అంటే ఒకతరం క్రికెటర్లకు ఒక శకం ముగిసినట్టేనని చెప్పాలి.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ కూడా 16 ఏళ్లకు పైగా క్రికెట్ ఆడారు. ఇప్పుడొక ఫార్మాట్ కి దూరమయ్యారు. రాబోవు మరో రెండేళ్లలో అటు టెస్టు, ఇటు వన్డేలకు కూడా దూరమవుతారేమోనని అభిమానులు నిరాశగా మెసేజ్ లు పెడుతున్నారు.

Tags

Related News

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Big Stories

×