BigTV English

LPG Cylinder Price : వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతో తెలుసా ?

LPG Cylinder Price : వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతో తెలుసా ?

LPG Cylinder Price Slashed by RS.30 : ప్రతినెలా 1వ తేదీన ఎల్పీజీ సిలిండర్ ధరలు మారుతాయి. ఈసారి వినియోగదారులకు చమురు సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై (Commercial LPG Cylinder Rate) రూ.30 తగ్గినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ (Domestic LPG Cylinder Rate) ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.


తగ్గిన ధరతో ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1646గా ఉంది. కలకత్తాలో రూ.1756, ముంబైలో రూ.1598కి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. 14.2 కేజీల సిలిండర్ ధర ముంబైలో రూ. 802.50 గా ఉంది. కోత్ కతాలో రూ.829, చెన్నైలో రూ.818.50కి 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. మార్చి 9వ తేదీ నుంచి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు జరగలేదు.

కాగా.. మే 1వ తేదీన కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.19 తగ్గింది. లోక్ సభ ఎన్నికలకు ముందు ధర తగ్గడంతో ఈసారి భారీగా గ్యాస్ ధరల వడ్డింపు ఉంటుందని భావించారు. ఏప్రిల్ 1న కూడా గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. రూ.30.50 తగ్గింది. ఫిబ్రవరిలో రూ.14, మార్చిలో రూ.25.50 మేర గ్యాస్ సిలిండర్ ధర పెరగ్గా.. జనవరిలో మాత్రం రూ.1.50 తగ్గించాయి చమురు సంస్థలు.


Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×