Siddharamiah | కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ఆదివారం తాజ్‌కృష్ణా హోటల్‌లో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
Siddharamiah | కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ఆదివారం తాజ్‌కృష్ణా హోటల్‌లో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
మీడియాతో ఆయన మాట్లాడుతూ.. “కర్ణాటకలో నిజంగా సమస్య అంటూ ఉంటే హైదరాబాద్‌లో నిరసన చేస్తారా?.. కర్ణాటక రైతుల పేరుతో తెలంగాణలో నిరసన చేసేవాళ్లు కర్ణాటక రైతులు కాదు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలన సరిగా లేదని చెబుతున్న కేసీఆర్‌కు మా రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించాను. ఈ రోజు మళ్లీ ఆహ్వానిస్తున్నాను. కేసీఆర్ వచ్చి కర్ణాటకలో ప్రభుత్వ పాలన చూడాలి. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కర్ణాటకలో జరుగుతున్న అభివృద్ధిని చూడాలని కోరుతున్నాను. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించి తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ తప్పకుండా అమలు చేస్తుంది. కర్ణాటక ఎన్నికలలో ఇచ్చిన హామీలను మేము అమలు చేయడం లేదని బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తోంది,” అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్, బీజేపీ నాయకులు.. ముఖ్యంగా కేసీఆర్ ఎన్నికల ప్రచారం కోసం అబద్ధాలు చేస్తున్నారని సిద్ధరామయ్య మండిపడ్డారు. కర్ణాటకలో ఇచ్చిన గ్యారెంటీ పథకాల అమలు కోసం నేను ప్రమాణస్వీకారం చేసిన రోజే తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కర్ణాటకలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని అన్నారు.
ఇవ్వనీ తెలిసి కూడా కేసీఆర్ కేవలసం ఎన్నికల ప్రచారం కోసం అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. అలాగే బిల్డర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రచారం అబద్ధమని చెప్పారు.
కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు గ్యారెంటీ పథకాలు అమలవుతున్నాయని.. ఇంకో గ్యారెంటీ పథకాన్ని కర్ణాటకలో జనవరిలో మొదలు పెడతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ పథకాలకు బడ్జెట్ కేటాయిస్తామని.. కర్ణాటకలో ఇంతకు ముందున్న బీజేపీ ప్రభుత్వం 600 హామీలు ఇచ్చి, అందులో కనీసం 10 శాతం హామీలను కూడా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వం 40% కమీషన్ అవినీతిని కాంట్రాక్టర్ల అసోసియేషన్ చేసిన ఆరోపణలను సిద్ధరామయ్య గుర్తుచేశారు.