E-Paper
Advertisement

Ponguleti Srinivas Reddy : నేనే ఎమ్మెల్యే.. ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు మరణశాసనమే!

Ponguleti Srinivas Reddy : నేనే ఎమ్మెల్యే.. ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు మరణశాసనమే!

Ponguleti Srinivas Reddy : ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. బిగ్ టీవీ ఇంటర్వ్యూలో తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. పొంగులేటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు గెలుస్తామని.. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వరని తెలిపారు. ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతారని పేర్కొన్నారు.

గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్‌ఎస్‌ హామీలు నెరవేర్చలేదని పొంగులేటి స్పష్టం చేశారు. కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాము ఏం చేశారో చెప్పకుండా అనవసర విమర్శలు చేస్తున్నారని తెలిపారు. దుష్ప్రచారాలు చేయడంలో సీఎం కేసీఆర్‌ దిట్ట అని పేర్కొన్నారు. ఉచిత కరెంట్‌ అనేది కాంగ్రెస్‌ పార్టీ పేటెంట్‌ అని గుర్తుచేశారు. రేవంత్‌, డీకే మాటలను వక్రీకరిస్తున్నారని పొంగులేటి తెలిపారు. 24గంటల ఉచిత కరెంట్‌ ఇచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

కేసీఆర్‌ మైండ్‌ దొబ్బి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార బీఆర్‌ఎస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీ పార్టీ అని.. కాంగ్రెస్‌ను ఓడించడమే బీజేపీ, బీఆర్‌ఎస్‌ లక్ష్యం అని తెలిపారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నాయని తెలిపారు.

అక్రమ సంపాదన తనకు లేదని, కల్వకుంట్ల కుటుంబమే అవినీతికి పాల్పడుతోందని పొంగులేటి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పతనానికి ధరణి కారణం కాబోతుంది.. ధరణితో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణిలోని మారుస్తామని తెలిపారు. ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు మరణశాసనం వంటిదని పేర్కొన్నారు. పాలేరులో కందాల కుటుంబం నాటకాలు ఆడుతోందని.. బీఆర్‌ఎస్‌ నేతల ట్రాపులో ప్రజలు పడొద్దని పొంగులేటి
విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు వందల కోట్లు ఖర్చు పెట్టినా గెలవరని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

.

.

Tags

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×