BigTV English

Vanitha Vijay Kumar : బిగ్‌ బాస్‌ వల్ల రచ్చ.. ప్రముఖ నటిపై దాడి..

Vanitha Vijay Kumar : బిగ్‌ బాస్‌ వల్ల రచ్చ.. ప్రముఖ నటిపై దాడి..
Vanitha Vijay Kumar


Vanitha Vijay Kumar : తమిళ్ బిగ్ బాస్ సీజన్ 7.. హౌస్ లో ప్రతిదీ ఏదో ఒక రచ్చగా మారుతుంది. హౌస్ లో జరుగుతున్న గొడవల ప్రభావం బిగ్ బాస్ కాంపౌండ్ దాటి బయట కనిపిస్తుంది. అయితే ఈ ప్రభావం ఎంతవరకు సమంజసం అనే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే లేటెస్ట్ సీజన్లో పాటిస్పేట్ చేసి ఇటీవల ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ వనిత విజయ్ కుమార్ పై అణుక్యంగా శనివారం రాత్రి దాడి జరిగింది. ఊహించని ఈ సంఘటన అందరినీ షాక్ కి గురిచేసింది.

వనిత విజయ్ కుమార్.. ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తర్వాత యూట్యూబ్ లో రివ్యూ ఇచ్చింది. శనివారం రాత్రి కూడా ఇలాగే తనకు తోచిన రివ్యూ ఇచ్చి.. డిన్నర్ అయ్యాక ఇంటికి వెళ్లడానికి బయటకు వచ్చింది. అంతే.. స్టూడియో దగ్గర పార్క్ చేసిన ఆమె కారు వద్దకు వెళ్లక ముందే ఒక గుర్తు తెలియని వ్యక్తి సడన్ గా ఆమెపై దాడి చేశాడు. వనిత ఎదురుగా వచ్చి అతను దాడి చేయడంతో ఆమె ముఖంపై గాయం అయింది. ఈ విషయాన్ని కూడా వనిత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.


అంతేకాదు తనపైన దాడి చేసింది కచ్చితంగా ప్రదీప్ ఆంటోనీ సపోటారే అని నొక్కి వక్కాడిస్తోంది. ఎందుకంటే దాడి చేసిన వ్యక్తి ప్రదీప్ కు రెడ్ కార్డు ఇస్తావా అని అన్నాడట. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7లో భాగంగా కంటెస్టెంట్ గా ఎంటర్ అయిన ప్రదీప్ ఆంటోనీ కు ఇటీవల కమల్ హాసన్ రెడ్ కార్డ్ ఇచ్చి మరీ బయటకు పంపాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ చర్చ కూడా జరిగింది. ప్రదీప్ మద్దతుదారులు అతన్ని సపోర్ట్ చేస్తూ ఎన్నో పోస్టులు పెట్టడంతో పాటు వైల్డ్ కార్డు ఎంట్రీ తో తిరిగి ప్రదీప్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలని డిమాండ్ చేశారు. ప్రదీప్ ఎలిమినేషన్ విషయంలో కోపం పెంచుకున్న ఒక అభిమాని తనపై కావాలని దాడి చేశాడు అని వనిత ఆరోపిస్తోంది. అయితే ఈ పోస్ట్ పై భిన్నమైన స్పందనను వ్యక్తమవుతున్నాయి. మరి పూర్తి విషయం ఏమిటో ఇంకా క్లియర్ గా తెలియదు.

Related News

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Big Stories

×