BigTV English

Solar Eclipse October 2023: సూర్యగ్రహణం.. ఏ దేశాల్లో కనిపిస్తుందంటే?

Solar Eclipse October 2023: సూర్యగ్రహణం.. ఏ దేశాల్లో కనిపిస్తుందంటే?

Solar Eclipse October 2023: హిందూ ధర్మంలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహణాల వెనుక ఆధ్యాత్మిక కారణం ఉందని చాలా మంది నమ్ముతారు.శాస్త్రీయంగా చెప్పాలంటే, భూమి, సూర్యుని మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. అక్టోబర్ నెలలో రెండు వారాల వ్యవధిలో సూర్య,చంద్ర గ్రహణాలు రెండూ సంభవించనున్నాయి. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14న శనివారం రాత్రి 8:34 గంటలకు ప్రారంభమై తెల్లవారు జామున 2:25 గంటలకు ముగుస్తుంది.


ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అయితే ఉత్తర అమెరికా,కెనడా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, గ్వాటెమాల, మెక్సికో, అర్జెంటీనా, కొలంబియా, క్యూబా, బార్బడోస్,పెరూ,ఉరుగ్వే,ఆంటిగ్వా, వెనిజులా, జమైకా,హైతీ,పరాగ్వే,బ్రెజిల్,డొమినికా,బహామాస్ వంటి దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది.

ఈ గ్రహణం ఒక “రింగ్ ఆఫ్ ఫైర్” గ్రహణంగా ఉంటుంది. దీని అర్థం, సూర్యుడు చంద్రుడిచే పూర్తిగా కప్పబడదు. సూర్యుని బయటి అంచు మాత్రమే కనిపిస్తుంది. దీనివల్ల ఒక మెరుస్తున్న వలయం ఏర్పడుతుంది, దీనిని “రింగ్ ఆఫ్ ఫైర్” అని పిలుస్తారు.


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ గ్రహణం మేష, కర్కాటక, తుల, మకర రాశి వారికి కొంత ప్రభావం చూపుతుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. గ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా చూడకూడదు. ఇది కళ్లకు హాని కలిగిస్తుంది. గ్రహణాన్ని చూడటానికి కళ్లద్దాలు లేదా ఫిల్టర్‌లతో కూడిన కెమెరాను ఉపయోగించాలి. ఈ సూర్యగ్రహణం ఒక అద్భుతమైన దృశ్యం. అయితే దీన్ని జాగ్రత్తగా చూడటం చాలా ముఖ్యం.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×