OTT Movie : కొన్ని సినిమాలు డిఫెరెంట్ కథాంశంతో వస్తుంటాయి. తక్కువ బడ్జెట్ లో వచ్చి, అవార్డులను దక్కించుకుని షాక్ ఇస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక వసంతి అనే వేశ్య చుట్టూ తిరుగుతుంది. ఆమె తన గతాన్ని స్టేజ్ నాటకం ద్వారా చెప్పడంతో కథ మొదలవుతుంది. ఇది కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాలేదు, ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘వసంతి’ (Vasanthi) ఒక మలయాళ డ్రామా సినిమా. దీనికి షినోస్ రహ్మాన్, సజాస్ రహ్మాన్ దర్శకత్వం వహించారు. ఇందులో స్వసిక విజయ్, సిజు విల్సన్, షబరీష్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో ప్రదర్శించబడింది. కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. IMDbలో 6.6/10 రేటింగ్ పొంది, 2025 ఆగస్టు 28 నుంచి మనోరమ మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
వాసంతి అనే ఒక వేశ్య తన జీవిత కథను సముద్రతీరంలో ఒక ఓపెన్ స్టేజ్‌పై నాటకం ద్వారా చెప్పడం మొదలుపెడుతుంది. ఆమె ఒక వేశ్యకు కుమార్తెగా పుట్టి, తండ్రి ఎవరో తెలియక బాధపడుతూ పెరుగుతుంది. యుక్తవయసులో ఆమె తల్లి ఆమెను బంధువుల దగ్గరకు పంపిస్తుంది. అక్కడ ఆమెను ఒక ముసలోడు అన్ని విధాలుగా వాడుకుంటాడు. ఒక రోజు బస్సులో ఆమె రామన్ అనే వ్యక్తిని కలుస్తుంది. అతనితో జీవించడానికి ఆ ముసలోడి దగ్గరనుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆ సంబంధం ఆమె జీవితాన్ని మరింత కష్టతరం చేస్తుంది. అతను ఆమె దగ్గర ఉన్న నక్లెస్ ను అమ్మి, ఆడబ్బులు ఉన్నంత వరకు ఎంజాయ్ చేస్తాడు.
ఆ తరువాత ఆమెను ఒక వేశ్యగా మార్చి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేస్తాడు. ఇందులో భాగంగా అతను తన స్నేహితున్ని ఆమె గదిలోకి పంపి బయట గడియ పెడతాడు. కొంతసేపటి తరువాత డోర్ తీస్తాడు. మరి లోపల ఏం జరుగుతుందో ఏమో తెలీదుగాని, ఆమె రామన్ తో గొడవ పడుతుంది. డబ్బులు అలా సంపాదించాలనుకుంటే నువ్వెందుకు అని నిలదీస్తుంది. ఇక ఆమె జీవితంలో అలాంటి వాళ్ళే ఎక్కువగా ఎదురుపడి ఆమెను వేశ్యగా మార్చేస్తారు. ఈ కథ ఒక స్టేజ్ నాటకంతో మొదలై, సినిమా ముగింపు ఆమె జీవితంలోని కష్టాలను ఆడియన్స్ ని ఆలోచింపజేసేలా చేస్తుంది.
Read Also : పోలీస్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్టులు … ఎటూ తేలని యవ్వారం …ఈ కిల్లర్ మామూలోడు కాదు