IND vs PAK Final: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్స్ కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఇవాళ రాత్రి టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్స్ జరుగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ టోర్నమెంట్ అద్భుతంగా రాణించిన టీమిండయా, పాకిస్థాన్ రెండు జట్లు ఫైనల్స్ కు వచ్చాయి. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో రెండు సార్లు ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇక ఇవాళ ముచ్చటగా మూడోసారి ఈ రెండు జట్ల మధ్య ఫైనల్స్ మ్యాచ్ జరుగనుంది.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్స్ లో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఇవాళ ఫైనల్స్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ లోని అంతర్జాతీయ స్టేడియంలో వేదికగా ఈ మ్యాచ్ జరగునుంది. భారత కాలమానం ప్రకారం…. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్స్ మ్యాచ్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ పూర్తయ్యే సారికి దాదాపు అర్థరాత్రి 12 గంటలు అవుతుంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఇవాళ్టి పిచ్ … మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉ న్నట్లు చెబుతున్నారు. టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఇవాళ ఫైనల్స్ మ్యాచ్ ను సోనీ లీవ్ లో చూడొచ్చు. సోనీ లీవ్ ఓటీటీలో ఉచితగా చూడాలంటే..రిచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు చెబుతున్నారు. ఈ మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా దూరం కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు… వస్తున్నాయి. శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మొన్న జరిగిన మ్యాచ్ సమయంలో ఒకే ఒక్క ఓవర్ వేసిన హార్దిక్.. ఆ తర్వాత బౌలింగ్ చేయలేదు. ఆయనకు చిన్న గాయమైనట్లు తెలుస్తోంది. అందుకే పూర్తిగా విశ్రాంతి ఇచ్చింది టీం ఇండియా. అయితే ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా గాయంపై టీమిండియా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి ఈ ఫైనల్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఆడతాడా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో టీమ్ ఇండియా అభిమానులు టెన్షన్ పడుతున్నారు. హార్దిక్ పాండ్యా లాంటి భయంకరమైన ఆల్ రౌండర్ జట్టులో లేకపోతే కష్టమేనని అంటున్నారు. అభిషేక్ శర్మ కోలుకున్నాడని ఫైనల్ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని.. తెలుస్తోంది.
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య రికార్డులు
టి20 లలో ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 15 మ్యాచులు జరిగాయి. ఇందులో 12 మ్యాచ్ లలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. పాకిస్తాన్ కేవలం మూడు మ్యాచ్లలో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అంటే పాకిస్తాన్ జట్టు పైన టీమిండియా ఆధిపత్యాన్ని చలాయిస్తోంది.
Also Read: Abhishek- Gambhir: అభిషేక్ శర్మను బండబూతులు తిట్టిన గంభీర్..ఈ దెబ్బకు ఉరేసుకోవాల్సిందే
IND Vs PAK Final Match TOMORROW… #indvspak2025 #asiacup2025final #AbhishekSharma #ShaheenShahAfridi #Cricket pic.twitter.com/cpgyvK69Qx
— Kàshìf Khàn (@Beaingkashif) September 27, 2025