
Telangana BJP Manifesto | తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు హైదరాబాద్ లో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోకు సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరు పెట్టారు.
తెలంగాణను ప్రగతి పథంలో నడిపేందుకు దశ అంశాల కార్యాచరణ రూపొందించినట్లు మేనిఫెస్టో విడుదల సందర్భంగా బీజేపీ ప్రకటించింది. అంతే కాదు ప్రజలందరికీ సుపరిపాలన, సమర్థవంతమైన పాలనపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపింది. అవీనితిని ఉక్కుపాదంతో అణచివేయడంతోపాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనలకు అనుగుణంగా .. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ నినాదంతో సుపరిపాలన అందిస్తామని ప్రకటించింది.
ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించడం ద్వారా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తామని తెలిపింది. అలాగే ధరణి వ్యవస్థ స్థానంలో పారదర్శకమైన ‘మీభూమి’ వ్యవస్థను తీసుకొస్తామంటోంది కమలం పార్టీ. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నోడల్ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది. తెలంగాణ గల్ఫ్ నివాసితుల సంక్షేమం కోసం ప్రత్యేక నోడల్ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఉద్యోగులు, పింఛనర్లకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు ఇచ్చేలా చూస్తామని తెలిపింది.
అలాగే రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్, వెనుకబడిన వర్గాల సాధికారత, అందరికీ చట్టం సమానంగా వర్తింపు, బీసీ వర్గం నుంచి సీఎం అభ్యర్థి, రాజ్యాంగానికి విరుద్దంగా ముస్లింలకు ఇచ్చిన
4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత. ఆ రిజర్వేషన్ SC, ST, BCలకు వర్తింపు.
తెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం.. ఎస్సీ వర్గీకరణకు సహకారం. కూడు-గూడు : ఆహార, నివాస భద్రత, అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు,
రైతే రాజు – అన్నదాతల కోసం ప్రత్యేక పథకం
కేంద్రం ఇచ్చే ఎరువులకు ఎకరానికి రూ.18వేల సబ్సిడీ విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రూ.2500, ప్రధాని పంటాబీమా కింద ఉచిత పంటబీమా, వరి పంటకు రూ.3100 మద్ధతు ధర
నిజామాబాద్‌లో టర్మరిక్ ఏర్పాటు, నారీశక్తి- మహిళల నేతృత్వంలో అభివృద్ధి, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్ధులకు ఉచిత ల్యాప్‌టాప్స్.
ఆడబిడ్డ భరోసా పథకం కింద..
21 ఏళ్లు వచ్చే సరికి రూ. 2లక్షల ఆర్థికసాయం
ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్లు
మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు
5 ఏళ్లలో మహిళలకి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో 10 లక్షల ఉద్యోగాలు
యువశక్తి-యువ ఉపాధి
6 నెలలకోసారి గ్రూప్-1, గ్రూప్-2 సహా TSPSC రిక్రూట్‌మెంట్ పరీక్షల నిర్వహణ