కూయిలీ ఎలాంటిదో తెలిసిపోయింది కదా..? ఇక నువ్వు ఇంటికి వస్తే బతికిపోతావు.. లేదంటే ఇక్కడే ఇలాగే బతుకు అంటూ ఒకవేళ కూయిలీని పెళ్లి చేసుకుంటే నీకు ఆస్థిలో చిల్లిగవ్వ కూడా రాదని బెదిరిస్తాడు రాజ్, ఇక మనం ఇక్కడ ఒక్క క్షణ కూడా ఉండొద్దని చెప్తుంది కావ్య. దీంతో గోల్డ్ బాబును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. బయటకు వెళ్లి నవ్వుకుంటారు. మొత్తానికి మనం అనుకున్న పని సాధించావు అని రాజ్ చెప్పగానే.. మనం ఇచ్చిన స్ట్రోక్ అలాంటిది. ఇప్పటికైనా నమ్ముతావా..? యాక్టింగ్ లో మనం కింగ్ అని ఇంకా ఎందుకు ఈ వేషాలు తీసేయండి అని గోల్డ్ బాబు చెప్పగానే..
రాజ్, కావ్య గెటప్ తీసేస్తారు. దూరం నుంచి రంజిత్ అంతా చూస్తుంటాడు. మనం ఎంత చేసినా కూయిలీ మళ్లీ రాహుల్‌ను మ్యానికులేట్ చేస్తుందేమో.. ఏడ్చి ఏదైనా మాయమాటలు చెప్తుందేమో..? అంటుంది కావ్య.. ఇన్ని రోజుల నుంచి రాహుల్ ను చూశావు వాడికి డబ్బు కన్నా వేరే ఏదీ ఎక్కువ కాదు.. వాడి ఇక ఇంటికి వస్తాడు మనం వెళ్దాం పద అంటూ అందరూ కలిసి వెళ్లిపోతారు. అంటే వీళ్లందరూ కలిసి నాటకం ఆడి రాహుల్ ను తీసుకెళ్లడానికి వచ్చారా..? అసలు ఇప్పుడు కూయిలీ పరిస్థితి ఏంటో..? అనుకుంటాడు రంజిత్.
మరోవైపు ఇంట్లో రాహుల్ కోపంగా కూయిలీని కొడతాడు. ఎంతకు తెగించావే.. అంటాడు. రాహుల్ నేను చెప్పేది విను రాహుల్.. అంటుంది. ఏంటో నువ్వు చెప్పేది.. నేను వినేది.. నేను అంటే ఇష్టం అన్నావు విన్నాను.. నాతోనే లైఫ్ అన్నాను నమ్మాను.. నా పెళ్లానికి విడాకులు ఇవ్వమన్నావు.. మనిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నావు.. ఇప్పుడు ఎవడో ఒకడు రాగానే.. చీ.. అంటూ తిడుతుంటే.. రాహుల్ నువ్వు అనవసరంగా నామీద అనుమాన పడుతున్నావు.. నీకు తెలిసిందంతా నిజం కాదు అంతా అబద్దం.. అని చెప్పగానే.. ఏదీ అబద్దం నీ దగ్గర కోట్ల ఆస్థి ఉందన్నది అబద్దం.. మనం పెళ్లి చేసుకుంటే లైఫంతా సుఖంగా ఉండొచ్చన్నది అబద్దం.. కానీ నన్ను వాడుకోవాలనుకుంది మాత్రం నిజం. నన్ను వెర్రి వాణ్ని చేయాలనుకున్నది మాత్రం నిజం.. నా దగ్గర కోట్లు ఉన్నాయని నమ్మి నన్ను వలలో వేసుకుంది నిజం. కానీ నాకన్నా మించిన వాడు దుబాయ్ నుంచి వచ్చిన వాడు నీకు దొరకగానే వాడి దగ్గర కోట్లు ఉన్నాయని చెప్పి.. వాడికి లొంగిపోయావు.. నన్ను కాదని వాడితో కులకడానికి సిద్ద పడ్డావు.. నువ్వు బజారు దానికన్నా హీనం అంటూ తిట్టగానే..
కూయిలీ కోపంగా రేయ్ ఏంట్రా ఏంటి రెచ్చిపోతున్నావు.. ఏంటి..? నేను బజారు దాన్ని అయితే మరి నా డబ్బు కోసం ఆశ పడ్డ నిన్ను ఏమనాలిరా..? అంటూ ప్రశ్నించగానే.. ఓసేయ్ నేను నీలా కాదే.. నా భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను..కానీ నువ్వు మొగుడు పక్కన ఉండగానే.. వాణ్ని మామయ్య అంటూ వాడు పక్కన ఉండగానే.. నన్ను ఎంటర్‌టైన్ చేస్తూ.. మళ్లీ నేను పక్కన ఉండగానే.. ఇంకొకడితో ఎటర్‌టైన్ చేస్తున్నావు.. అలాంటి నీకు ఇంకో కొత్త పేరు పెట్టాలి అంటూ తిట్టగానే.. కూయిలీ కోపంగా అవునురా నేను నిన్ను కావాలనే ట్రాప్ చేయాలనుకున్నాను.. నీ పెళ్లానికి నీ చేత్తో విడాకులు ఇప్పించి నీ ఆస్థిని కొట్టేయాలనుకున్నాను.. కానీ నిన్ను మించిన గోల్డ్ బాబు బంగారు బిస్కెట్స్ తో నాకు తగిలాడు.. వాడిని పడగొట్టాను.. అయితే ఏంట్రా ఏం చేయగలవు అంటుంది. దీంతో రాహుల్ కోపంగా అంటే కావాలనే నా జీవితంతో ఆడుకున్నావు కదే.. అంటూ గొడవ పడుతుంటే.. అప్పుడే వచ్చిన రంజిత్ వాళ్ల గొడవను వీడియో తీస్తుంటాడు. ఇంతలో రాహుల్ కోపంగా కూయిలీని కొడతాడు. కూయిలీ కింద పడిపోతుంది. అదంతా రికార్డు చేసుకుని వెళ్లిపోతాడు రంజిత్..
దుగ్గిరాల ఇంట్లో అందరూ కూర్చుని హ్యాపీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటుంటారు.. కూయిలీ, రాహుల్ మధ్య ఎలా గొడవ పెట్టారో రాజ్, కావ్య చెప్తుంటే అందరూ వింటూ నవ్వుతుంటారు. ఇంతలో రాహుల్ ఇంటికి వస్తాడు. గుమ్మం ముందు నిలబడి తల వంచుకుని ఇంట్లోకి రాబోతుంటే.. స్వప్న కోపంగా రాహుల్‌ను తిడుతుంది. రాహుల్ తాను మారిపోయానని క్షమించమని ఎమోషనల్ అవుతాడు. అందరూ చెప్పడంతో స్వప్న, రాహుల్‌ను లోపలికి తీసుకెళ్తుంది. తర్వాత రుద్రాణి కోపంగా రాహుల్‌ను కొడుతుంది. ఇలా చేశావేంటి..? అని నిలదీస్తుంది. ఇప్పటి నుంచి నేను చెప్పింది వింటూ నన్ను ఫాలో అయిపో అని చెప్తుంది. రాహుల్ సరే అంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.