Big Stories

Congress: త్వరలో కాంగ్రెస్ బస్సుయాత్ర.. నేతలంతా కలిసి దండయాత్ర.. కేసీఆర్‌కు కంగారే!

congress seniors

Congress: ఇది కేసీఆర్‌కు దిమ్మతిరిగే న్యూస్. గులాబీ బాస్ మైండ్ బ్లాంక్ చేసే టూర్. నిత్యం కల్లోల కాపురం చేసే కాంగ్రెస్ నేతలంతా ఏకమవుతున్నారు. చేయి చేయి కలిపి.. జట్టు కట్టి.. కలిసికట్టుగా జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. అంతా కలిసి ఒకే బస్సులో బస్ యాత్ర చేయనున్నారు. ఇది కదా రాజకీయమంటే. ఇది కదా వ్యూహమంటే.

- Advertisement -

నమ్మశక్యంగా లేకున్నా.. ఇది నమ్మాల్సిన విషయమే. అవును, కాంగ్రెస్ నేతలంతా కలిసి బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు. అంతా కలిసి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించబోతున్నారు. కాంగ్రెస్ గెలుపునకు వారంతా బస్సులో ప్రజల ముందుకు రాబోతున్నారు. ఎప్పుడో కాదు.. త్వరలోనే. ఈ విషయం పార్టీ ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రేనే జడ్చర్లలో జరిగిన పీపుల్స్ మార్చ్ బహిరంగ సభ వేదికగా ప్రకటించారు.

- Advertisement -

బస్సులో ఎవరెవరు ఉండొచ్చు? పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తప్పక ఉంటారు. సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క కంప్లసరీ. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి, వీహెచ్, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, వస్తే జగ్గారెడ్డి.. ఇలాంటి హేమాహేమీల్లాంటి నేతలంతా కలిసి ఒకే బస్సులో జిల్లాలకు వెళితే..? ప్రజలకు జట్టుగా కనిపిస్తే..? ఆ సీన్ మామూలుగా ఉండదుమరి. పోలా.. ఐడియా అదిరిపోలా.

అయితే, కాంగ్రెస్ బస్సు యాత్ర షెడ్యూల్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. నేతలంతా కలిసి బల ప్రదర్శనగా జిల్లాలకు వెళతారా? పెద్ద లీడర్లు వీలును బట్టి బస్సు ఎక్కుతారా? ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లా సీనియర్లు ప్రయాణిస్తారా? గాంధీభవన్ నుంచి ఒక్కో వారం ఒక్కో జిల్లాకు నేతలంతా కలిసి వెళతారా? బస్సుయాత్ర స్ట్రాటజీ ఎలా ఉండబోతుందోననే ఆసక్తి కార్యకర్తల్లో పెరుగుతోంది. అయితే, బస్సుయాత్ర ఉంటుందని థాక్రే ప్రకటించారు సరే.. మరి, నేతలంతా కలుస్తారా? అంతాకలిసి ఒకే బస్సు ఎక్కుతారా? కాంగ్రెస్ బస్సును అసెంబ్లీకి చేరుస్తారా? అసలే.. కాంగ్రెస్.. అందుకే ఈ డౌట్స్!

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News