New Train Rules: దీపావళి పండగ నేపథ్యంలో.. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణీకులు సురక్షితంగా, సజావుగా ప్రయాణించేందుకు రైల్వే అనేక ఏర్పాట్లు పూర్తి చేసింది. పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రయాణీకులలో అవగాహన పెంచే దిశగా రైల్వే అనేక వ్యూహాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. రద్దీని నియంత్రించేందుకు, ప్లాట్ ఫామ్‌లపై జన సందోహాన్ని తగ్గించేందుకు, ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శాశ్వత హోల్డింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణీకుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, టైన్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు గందరగోళం లేకుండా చూసేందుకు ఈ స్థలం ఉపయోగపడుతుంది.
ప్రయాణీకుల భద్రత కోసం నిషేధించిన ఆరు వస్తువులు:
రైల్వేలలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. పండగల సమయాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగే కారణంగా, అగ్నిప్రమాదాలు లేదా ఇతర ప్రమాదాలను నివారించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ కొన్ని వస్తువులను రైళ్లలో తీసుకెళ్లడాన్ని కఠినంగా నిషేధించింది. ఈ నిషేధిత వస్తువుల గురించి ప్రయాణికులు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
రైలు బోగీల్లో ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి, అగ్ని ప్రమాదాల ప్రమాదాన్ని తగ్గించడానికి రైల్వేలు ఈ కింది ఆరు వస్తువులను తీసుకు రాకుండా నిషేధించారు.
1.పటాసులు
2.కిరోసిన్
3.గ్యాస్ సిలిండర్లు
4.స్టవ్‌లు
5. అగ్గిపెట్టెలు
6. సిగరెట్లు
పటాకులు : ఇవి త్వరగా మండే స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి, రైలు లోపల పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కిరోసిన్ : ఇది మండే స్వభావం కలిగి ఉంటుంది. దీనిని రైళ్లలో తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం.
గ్యాస్ సిలిండర్లు : వంట కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను రైలులో అనుమతించరు. ఎందుకంటే అవి పేలిపోయే ప్రమాదం ఉంది.
స్టవ్‌లు: వంట చేయడానికి ఉపయోగించే స్టవ్‌లు (ముఖ్యంగా కిరోసిన్ లేదా గ్యాస్ ఆధారితవి) కూడా ట్రన్‌లో నిషేధించారు.
Also Read: ప్రయాణికులకు అలర్ట్.. ఆ రూట్‌లో వెళ్లే రైళ్లన్నీ రద్దు, ముందుగా చెక్ చేసుకోండి
అగ్గిపెట్టెలు: మండే వస్తువుల జాబితాలో ఇవి కూడా ఉన్నాయి. చిన్న అజాగ్రత్త కూడా పెద్ద అగ్ని ప్రమాదానికి కారణం కావచ్చు.
సిగరెట్లు : రైలు బోగీల్లో పొగతాగడం అనేది పూర్తిగా నిషేధం అగ్ని ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది.
ఈ నిషేధిత వస్తువులను రైలులో తీసుకెళ్లడం అనేది భద్రతా నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. అంతే కాకుండా ఇది చట్ట పరమైన చర్యలకు దారితీస్తుంది. ప్రయాణీకులు సురక్షితమైన ప్రయాణానికి సహకరించి, ఈ నియమాలను పాటించడం తప్పనిసరి. ఏదైనా అనుమానాస్పద వస్తువు కనిపిస్తే వెంటనే.. రైల్వే సిబ్బందికి లేదా RPFకి తెలియ జేయాలి.