AP Politics: ఏపీలోని ప్రధాన పొలిటికల్ పార్టీలన్నీ వైజాగ్ మీదే పూర్తి ఫోకస్‌తో పని చేస్తున్నాయి. అక్కడ తమ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బలమైన ముద్ర వేసిన ఆయా పార్టీలు ఇప్పుడు వైజాగ్ తమ కార్య స్థానంగా చేసుకోవాలని చూస్తున్నాయి. వైజాగ్ నుంచి ఉత్తరాంధ్ర మొత్తం వ్యాపించాలనేది వాటి వ్యూహంగా కనిపిస్తుంది. ఆ క్రమంలో విశాఖ సిటీలో ఎప్పుడూ సత్తా చూపించలేకపోయిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో అక్కడ బలమైన పునాదులు వేసుకోవడానికి కసరత్తు ప్రారంభించిదంట..
3 రాజధానుల బిల్లుతో అమరావతి ప్రాంతంలో వైసీపీపై వ్యతిరేకత
రాయలసీమ జిల్లాల్లో గత ఎన్నికల్లో అంతోఇంతో బలం చాటుకున్న వైసిపి అమరావతి రాజధాని ప్రాంతంలో మాత్రం బాగా దెబ్బతింది. మూడు రాజధానుల బిల్లు తేవడం, అమరావతి రైతులపై నిర్బంధం వంటివి ఆ ప్రాంత ప్రజలు వైసీపీకి దూరం జరిగేలా చేశాయి. ఇప్పటికీ అమరావతిపై వైసీపీ స్టాండ్ ఏమిటి అనేది కింది స్థాయి నేతలకూ అర్థం కావడం లేదంట. వైజాగ్‌ను తమ కార్యక్రమాలకు వేదికగా చేసుకోవాలని ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. తాము అధికారంలో ఉన్న ఐదేళ్లు వైజాగ్‌ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటర్‌గా ప్రకటించి.. అక్కడి నుంచే పాలన అంటూ హడావుడి చేసింది.
మళ్లీ గెలిస్తే విశాఖను రాజధానిగా చేయడానికి ప్రయత్నాలు
ఒకవేళ గత ఎన్నికల్లో వైసిపి గెలిచుంటే వైజాగ్‌నే ఏపీకి రాజధానిగా మార్చేసి ఉండేదంటున్నారు. ఆ మేరకు ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఒకటికి రెండుసార్లు ప్రస్తావించారు కూడా. ఆ క్రమంలో రుషికొండను తొలిచేసి.. తన క్యాంప్ ఆఫీసు కోసం ప్రజాధనంతో భారీ ప్యాలెస్ నిర్మించుకున్నారు. తీరా చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పార్టీకి బయటకు తీసుకోచ్చేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉత్తరాంధ్ర జిల్లాలపై ఫోకస్ పెట్టారు. ఈనెల 9న నర్సీపట్నం పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఉత్తరాంధ్రలో వైసీపీని చావుదెబ్బ కొట్టిన ఓటర్లు
2019-24 మధ్య అటు పార్టీ పరంగా, ఇటు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు, నేతలు వ్యవహారించిన తీరు ఉత్తరాంధ్రలో వైసీపీని చావుదెబ్బ కొట్టాయి. 2024 ఎన్నికల తర్వాత సైలెంట్‌గా ఉన్న వైసీపీ ఈమధ్య మళ్లీ దూకుడు పెంచుతోంది. బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ లాంటి మాజీ మంత్రులు విశాఖ నుంచే ప్రస్తుత ప్రభుత్వంపై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఎలాగైనా ఉత్తరాంధ్రలో మళ్ళీ బలపడాలని వైసీపీ కార్యచరణ మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. రాయలసీమలో తాము బలంగా ఉన్నామని భావిస్తున్న వైసీపీ ఉత్తరాంధ్రలో కూడా బలపడితే తమకు ఎదురు ఉండదని లెక్కలు వేసుకుంటోందంట.
ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో జగన్ సమావేశం
గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన తప్పులు ఏంటి? భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళ్లాలి.. ఏ రకమైన కార్యచరణ రూపొందించాలి అనే అంశాలపై ఉత్తరాంధ్ర ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. అలాగే ఈనెల 9వ తేదీన ఉత్తరాంధ్ర ప్రాంతంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీని స్వయంగా పరిశీలించబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తామని చెబుతున్న నేపథ్యంలో మెడికల్ కాలేజీ అంశాన్ని ప్రధాన ఏజెండాగా పెట్టుకొని ఉత్తరాంధ్ర నుంచే పోరాటాలు చేయాలని వైసిపి ఆలోచన చేస్తుందట.
స్టీల్ ప్లాంట్ కారర్మికుల పక్షాన నిలబడేలా ప్రయత్నాలు
ఓటమి తర్వాత డీలా పడిని పార్టీని మరింత యాక్టివ్ చేసేలా జగన్ కార్యచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే విధంగా..అలాగే కార్మికుల పక్షాన నిలబడేలా ప్రయత్నాలు చేస్తోంది ఫ్యాన్ పార్టీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవైటీకరణ జరగే ప్రసక్తే లేదని కూటమి ప్రభుత్వంలోని నేతలు చేబుతున్నప్పటికి.. పరిశ్రమలలో జరుగుతున్న పరిణామాలపై కార్మికులతో కలిసి పోరాటాలు చేసేలా అడుగులు వేస్తోంది వైసీపీ. దీంతో పాటు విశాఖలో పరిశ్రమలకు కేటాయిస్తున్న భూముల విషయంలోనే ఆందోళన చేస్తున్న పరిస్ధితి. ప్రైవేట్ సంస్థలకు నామమాత్రపు ధరలకు భూములు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ.. ఈ అంశాలపై నిరసనలు చేపట్టింది వైసీపీ. ఇక మరోవైపు నూతన మెడికల్ కాలేజీల అంశంపై పోరుబాట పడుతున్నారు వైసీపీ నేతలు. ఈ అంశంపైనే నేరుగా ఫీల్డ్ విజిట్ చేయనున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఈనెల 9న నర్సీపట్నంలో వైసీపీ హయంలో చేపట్టిన మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.
క్యాడర్‌ను మరింత బలోపేతం చేయడానికి వ్యూహరచన
ఓవైపు పార్టీ పరంగా యాక్టివేట్ చేస్తూనే.. కేడర్‌ను మరింత బలోపేతం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారట జగన్. ఓటమి తర్వాత ఫ్యాన్ పార్టీలోని కొందరూ నేతలు పార్టీని వీడారు .జీవీఎంసీ మేయర్ స్థానాన్ని కూడా వైసీపీ పార్టీ ఫిరాయింపులతో కొల్పోయింది. దీంతో పార్టీ మరింత బలహీనమైందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తోంది. దాంతో పాటు ఉమ్మడి జిల్లాల్లో చాలా మంది నాయకులు ఇంకా యాక్టివ్‌గా కార్యక్రమాలు నిర్వహించడంలేదు. వీటిని సరిచేస్తే కానీ పార్టీకి మళ్లీ పుంజుకోదనే చర్చ పార్టీ నేతలు ఉందట. అందుకే పార్టీ బలోపేతంతో పాటు, నేతలను యాక్టివ్ చేసేలా జగన్ యాక్షన్ ప్లాన్ చేస్తున్నారట. తాడేపల్లిలో జరిగే పార్టీ ముఖ్యనేతల సమావేశంలో భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం చేయబోతున్నారట.
Also Read: నా సెగ్మెంట్‌లో నీకేం పని.. బండిపై రగిలిపోతున్న ఈటల
మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాల్లో వైసీపీ రెండు అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంటు స్థానంలోని గెలుపొందండి.. అందుకే 2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు 2029 ఎన్నికల్లో వచ్చే విధంగా ప్లాన్ చేస్తూ… త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే పట్టును నిలుపుకునే ప్రయత్నాలు ప్రారంభించారట జగన్. మరి మాజీ ముఖ్యమంత్రి వ్యూహాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.
Story By Rami Reddy, Bigtv