E-Paper
Advertisement

Telangana Election Results: తెలంగాణ ఓట్ల లెక్కింపు.. లీడింగ్ అభ్యర్థులు వీరే..

Telangana Election Results: తెలంగాణ ఓట్ల లెక్కింపు.. లీడింగ్ అభ్యర్థులు వీరే..
Advertisement

Telangana Election Results: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు మొదలైంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఒక్క కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుళ్లలో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్- కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోంది. ఇప్పటి వరకూ జరిగిన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రకారం.. కామారెడ్డిలో కేసీఆర్ వెనుకబడ్డారు. ఇక్కడ బీజేపీ లీడింగ్ లో ఉంది.

ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్, చాంద్రాయణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్, మంచిర్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమసాగర్, కొడంగల్ లో రేవంత్ రెడ్డి, నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధిరలో భట్టి విక్రమార్క ముందంజలో ఉన్నారు. వికారాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద్ కుమార్, పరిగిలో కాంగ్రెస్ అభ్యర్థి రాం మోహన్ రెడ్డి, సిద్ధిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు, సిరిసిల్లలో కేటీఆర్ ముందంజలో ఉన్నారు.

Advertisement

వర్థన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు, పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి, నిర్మల్ లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మిర్యాలగూడ, ఇల్లందు, ఆలేరు, ఖైరతాబాద్, నాగార్జున సాగర్, పరిగి, భువనగిరి అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. చార్మినార్ లో బీజేపీ లీడింగ్ లో ఉంది.

ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క, గోషామహల్ లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్, వైరాలో కాంగ్రెస్ అభ్యర్థి మాలోతు రాందాస్ లీడింగ్ లో కొనసాగుతుండగా.. మేడ్చల్, మల్కాజ్ గిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, అంబర్ పేట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది.

Advertisement

తొలి రౌండ్ పూర్తయ్యే సరికి అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ 4050 ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు. మధిరలో భట్టి విక్రమార్క 2098 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. ఖమ్మంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు 111 ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు. హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి 2380 ఓట్లతో, నకిరేకల్ లో కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం 2408, పాలకుర్తిలో 738 ఓట్లతో యశశ్విని రెడ్డి, గజ్వేల్ లో 302 ఓట్లతో కేసీఆర్, మెదక్ లో రోహిత్ రావు లీడింగ్ లో ఉన్నారు. రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×