E-Paper
Advertisement

Employees vote : ఉద్యోగుల ఓట్లు గోవిందా.. గోవిందా !

Employees vote  : ఉద్యోగుల ఓట్లు గోవిందా.. గోవిందా !
Advertisement
Employees vote

Employees vote : : మొదలైపోయింద్రా బాబోయ్.. ఓట్ల గందరగోళం మొదలైపోయింది. ఎన్నికల్లో గెలవడానికి సర్వశక్తులు ఉపయోగించిన సీఎం కేసీఆర్ ఆఖరి అస్త్రం తీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒక లక్ష మంది ఉద్యోగుల ఓట్లు గల్లంతయ్యేలా ఉన్నాయి. ఇంక ఒక్కరోజే సమయం ఉంది. ఎంతమందికి పోస్టల్ బ్యాలెట్లు అందుతాయో, ఎంతమందికి అందవో తెలీని పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడే ఉద్యోగుల్లో తమ ఓట్లు ఏమయ్యానే ఆందోళన మొదలైంది. వారి కంగారు ఎందుకంటే, తాము ఓటు వేయకపోయినా పర్వాలేదు గానీ, ఆ ఓటు దుర్వినియోగం కాకూడదని కోరుకుంటున్నారు.

Advertisement

2023లో తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో 3 .03 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 1.68 లక్షల మందికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు అనుమతిచ్చారు. కానీ అందులో లక్షమందికి ఇంకా పోస్టల్ బ్యాలెట్లు అందలేదు. మరి అవేమైనా మిస్ యూజ్ అయ్యాయా? లేదంటే ఉద్యోగులు అటు ఎన్నికలకు వెళ్లగానే, వారి పేరు మీద ఆ పోలింగ్ బూత్ ల దగ్గర దొంగ ఓట్లు వేసేయడానికి ఎవరైనా ప్లాన్లు రెడీ చేస్తున్నారా? అన్నది తెలీడం లేదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

నిజానికి ఢిల్లీలోని ఎలక్షన్ కమీషన్ కి ప్రత్యేకంగా ఎన్నికల విధులు నిర్వహించడానికి వారికి సొంతంగా సిబ్బంది అంటూ ఉండరు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే, ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే ఎన్నికల సంఘం కంట్రోల్ లోకి వెళతారు. అది కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి వారు ఈసీ చెప్పినట్టు వినాల్సిందే.

Advertisement

ఐఏఎస్, ఐపీఎస్ ల దగ్గర నుంచి టీచర్లతోసహా ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అంతవరకు రాష్ట్ర ప్రభుత్వంలో  సీఎం కేసీఆర్ కి, ఎమ్మెల్యేలకి సలాంలు కొట్టిన వాళ్లందరూ ఈసీ కంట్రోల్ లోకి వెళతారు. మరప్పుడు ఈసీ చెప్పినట్టు చేస్తారా? ఇంతకాలం అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్టు వింటారా? అనేది అందరికీ తెలిసిన విషయమే.

అందుకనే ఎన్నికలకు ఆరునెలల ముందు నుంచే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు తమకి కావల్సిన అధికారులు, పోలీసులు, ఉన్నతాధికారులను ఎంపిక చేసుకుని మరీ తమ ప్రాంతాలకు బదిలీలు చేయించుకుంటారు. లేదా తమ పరిధిలో ఉంచుకుంటారు. ఇప్పుడిక్కడ అధికారులు ఏం చెబితే, అదే ఈసీకి ఫైనల్.. ఆ రిపోర్టులు ఆధారంగానే ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఇది ఎన్నికల సమయంలో జరిగే ఒక మెకానిజం. దీని ప్రకారమే చక్రం తిరుగుతూ ఉంటుంది.

ఇప్పుడు ఒక లక్ష ఓట్లు ఎటుపోయాయో తెలీదు. అసలు ఉన్నాయో లేవో తెలీదు. అసలు పోస్టల్ బ్యాలెట్లు ఆయా అడ్రస్ లకి పంపించడానికి అవసరమైన మ్యాన్ పవర్ సెక్రయటరేట్ లో ఉందో లేదో తెలీదు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లను మడతపెట్టి, కవర్ లో పెట్టి దాన్ని అంటించి దానిమీద అడ్రస్ టైప్ చేసిన దాన్ని అంటించి, వెళ్లి పోస్టు బాక్స్ లో వేయాలి. ఇంతవర్క్ ఈ టైమ్ లో అదీ ప్రభుత్వోద్యుగులు చేస్తారా? అంటే డౌటే అని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో లక్షవరకు బ్యాలెట్ ఓట్లు అందకపోవడంపై కొందరు ఉద్యోగులు ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం. మరెంతవరకు ఇది వర్కవుట్ అవుతుందో తెలీదు. రేపు ఏం జరగనుందో అదీ తెలీదు..అని నెట్టింట అప్పుడే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×