E-Paper
Advertisement

Tillu Square second single : టిల్లు స్క్వేర్ సెకండ్ సింగిల్.. రాధిక రింగుల జుట్టుకు టిల్లు ఫిదా..

Tillu Square second single : టిల్లు స్క్వేర్ సెకండ్ సింగిల్.. రాధిక రింగుల జుట్టుకు టిల్లు ఫిదా..
Advertisement
Tillu Square second single

Tillu Square second single : సిద్దు జొన్నలగడ్డ స్వయంగా కథ ,డైలాగ్స్ అందిస్తు నటించిన మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘డీజే టిల్లు’. సింపుల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అందులోని డైలాగ్స్ , టేకింగ్ కారణంగా అంచనాలను మించి సక్సెస్ అందుకుంది. సాంగ్స్ దగ్గర నుంచి సీన్స్ వరకు.. కథ దగ్గర నుంచి కంటెంట్ వరకు.. ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగడంతో ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఇదే ఊపులో దీనికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే మూవీ యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ డీజే టిల్లు కి మించి ఉంటుంది అని హింటు ఇస్తూ దీనికి టిల్లు స్క్వేర్ అన్న పేరు పెట్టారు మేకర్స్. చెప్పినట్టుగానే సాంగ్స్ తో ఇప్పటివరకు అదరగొడుతున్నారు.. దీంతో రాబోయే మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి. మల్లిక రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్ లో రాధికా పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్న చిత్ర బృందం టికెట్ కొనకుండా అనే ఫస్ట్ సాంగ్ ని విడుదల చేసి మంచి బజ్ క్రియేట్ చేశారు.

Advertisement

ఇక ఈరోజు రాధిక రింగుల జుట్టుకు ఫిదా అయిపోయిన టిల్లు ప్రేమగోలతో మరొక సాంగ్ విడుదల చేశారు. వెరైటీ లవ్ ప్రదర్శించే ఈ పాటకు లిరిక్స్ కాసర్ల శ్యామ్, సంగీతం రామ్ మిర్యాల అందించారు. ఫస్ట్ సింగిల్ టైప్ లోనే పాటకి ముందు ఒక సీన్ ని చూపించారు. ఇందులో రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు .. అదే ఇన్స్టిట్యూట్లో డిగ్రీ చేసి..టిల్లు లాంటి వాళ్లతో ఆడుకుంటూ బయటికి వస్తారు. దేవదాస్ ..పార్వతి, లైలా.. మజ్ను ఇలా హిస్టరీలో ఉన్న అన్ని ప్రేమ కథల్లో బాధ ఇద్దరూ అనుభవించారు. అయితే రాధిక ప్రేమలో మాత్రం సఫర్ అయ్యేది టిల్లు ఒక్కడే అంటూ చెప్పుకొచ్చాడు సిద్దు. మొత్తానికి రాధిక జపం చేస్తూ టిల్లు పాడే ఈ పాట మంచి మాస్ బీట్ తో సాగుతోంది. ఈ సాంగ్ లో అనుపమ పింక్ శారీలో అందానికే నిర్వచనంలా ఉంది. మరో పక్క సిద్దు మాస్ డీజే గెటప్ లో కిరాక్ గా ఉన్నాడు. ఈ సాంగ్ కూడా ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ కి తీసిపోకుండా.. మూవీపై మరింత బజ్ క్రియేట్ చేసేలా ఉంది. 2024 ఫిబ్రవరి 9న ఈ మూవీ విడుదల అవుతుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×