E-Paper
Advertisement

Telangana Phone Tapping Case: కొత్త మలుపు తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు, భుజంగరావుకి మధ్యంతర బెయిల్

Telangana Phone Tapping Case: కొత్త మలుపు తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు, భుజంగరావుకి మధ్యంతర బెయిల్
Advertisement

Telangana Phone Tapping Case:  ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గుండె సంబంధిత చికిత్స నేపథ్యంలో 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు తీర్పునిచ్చింది. బెయిల్ నేపథ్యంలో పలు షరతులను విధించింది న్యాయస్థానం. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది.

తెలంగాణలో సంచలనం సృష్టించిన కేసు ఫోన్ ట్యాపింగ్‌. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2 గా అదనపు ఎస్పీ భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. అనారోగ్యం కారణంగా ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

ఇటు పిటిషనర్, అటు అధికారుల నుంచి వాదనలు విన్న నాంపల్లి కోర్టు , 15రోజులపాటు మధ్యంతర బెయిలిచ్చింది. బెయిల్ సమయంలో పలు షరతులను విధించింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ఏడాది మార్చి23న భుజంగరావుని అరెస్ట్ చేశారు పోలీసులు.

ALSO READ: సీఎం రేవంత్ ప్రతిపాదన, ఇవాళ సింఘ్వి నామినేషన్

Advertisement

ఈ కేసులో కీలక నిందితుడు ఏ 1 ప్రభాకర్‌రావు బయటపడేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.  ఏ6 శ్రవణ్‌కుమార్ పరారీలో ఉన్నారు. ఆయన దుబాయ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం కారణాలతో తాను అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని, కోలుకున్న తర్వాత వస్తానని ప్రభాకర్‌రావు న్యాయస్థానానికి తెలిపారు.

వీరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యాయి. కేసు మొదలై చాన్నాళ్లు గడుస్తున్నా కీలక నిందితులను హాజరుపరచకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. ఇంటర్ పోల్ ద్వారా నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీకి ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×