BigTV English

Football Match Cancelled: జూనియర్ డాక్టర్ హత్యాచారం.. కోల్ కతాలో ఫుట్ బ్యాల్ మ్యాచ్ రద్దు

Football Match Cancelled: జూనియర్ డాక్టర్ హత్యాచారం.. కోల్ కతాలో ఫుట్ బ్యాల్ మ్యాచ్ రద్దు

Durand Cup 2024  Football match Called Off Due To Kolkata Doctor Rape-Murder Protests: పశ్చిమబెంగాల్ లో  ఉద్రిక్తతలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిపాలనపై ఈ ఘటన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ వస్తున్న డిమాండ్లు ఆమెకు తలనొప్పిగా మారాయి.


ఈనేపథ్యంలో కోల్ కతాలో జరగాల్సిన ఒక ఫుట్ బాల్ మ్యాచ్ రద్దయిపోయింది. దురంద్ కప్ 2024లో భాగంగా మోహన్ బగన్ వర్సెస్ ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ మధ్య వివేకానంద యువ భారతి మైదానంలో జరగాల్సిన మ్యాచ్ రద్దయిపోయింది. ఉద్రిక్తతల నేపథ్యంలో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు.

ఎందుకిలా జరిగిందంటే, ఇదే సమయంలో కోల్‌కతా సాల్ట్‌ లేక్‌ స్టేడియం దగ్గర  హత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నిరసనకారులు ర్యాలీ చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.


Also Read: వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డ్

అగ్నికి వాయువు తోడైనట్టు మ్యాచ్‌కు హాజరయ్యే అభిమానులు.. హత్యాచారానికి గురైన డాక్టర్‌కు మద్దతుగా ప్లకార్డ్స్, టీషర్ట్స్ ధరించి హాజరుకానున్నారనే సమాచారం అందడంతో శాంతి భద్రతల ద్రష్ట్యా మ్యాచ్ ని రద్దు చేసినట్టు తెలిసింది.

ఎందుకంటే స్టేడియంలోకి వేలాదిమంది వస్తారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక్కసారి తొక్కిసలాట జరిగిందంటే ఊహించని పరిణామాలు ఎదురవుతాయి, ఎందుకొచ్చిన గొడవంటూ రద్దు చేశారని అనుకుంటున్నారు. మొత్తానికి జూనియర్ డాక్టర్ వ్యవహారం పశ్చిమ బెంగాల్ అధికారిపార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×