Big Stories

Telangana Prajadarbar | ట్విట్టర్ బీఆర్ఎస్.. ప్రజాదర్బార్ కాంగ్రెస్.. ఏది బెటర్?

Share this post with your friends

Telangana Prajadarbar | ట్విట్టర్ లో సమస్యలు వినడం కరెక్టా..? ప్రజా దర్బార్ నిర్వహించడం సబబా? ఇప్పుడిదే ప్రశ్న తెలంగాణలో చక్కర్లు కొడుతోంది. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా ప్రజాదర్బార్ నిర్వహించలేదు. ముఖ్యమంత్రిగా జనాలను కలిసిన సందర్భమే లేదు. ప్రగతిభవన్ గేట్లు దాటేవారి సంఖ్య కూడా వేళ్ల మీద లెక్కించవచ్చు. కానీ తెలంగాణలో నూతన సర్కార్ కొలువుదీరిన మరునాడే ప్రజాదర్బార్ నిర్వహించి.. రేవంత్ రెడ్డి తన మార్కును చాటుకున్నారు.

తెలంగాణలో ప్రజాప్రభుత్వం కొలువుదీరింది. ప్రమాణస్వీకారం రోజే ప్రగతి భవన్ గడీలను బద్దలుకొట్టారు. ప్రగతి భవన్ ను జ్యోతిబాపూలే ప్రజాభవన్ గా మారుస్తున్నట్టు ప్రకటించారు. అంతే కాదు ఎల్బీస్టేడియం వేదికగానే ప్రజాదర్బార్ పై కీలక ప్రకటన చేశారు. రేపే షూరు చేస్తానన్నారు. చెప్పినట్టే స్టార్ట్ చేసేశారు కూడా. డిసెంబర్ 7న సర్కార్ కొలువుదీరితే.. డిసెంబర్ 8న తొలి ప్రజాదర్బార్ నిర్వహించారు.

ప్రజల కష్టాలను గుర్తించిన రేవంత్ రెడ్డి మొదటి రోజునే… ప్రజాదర్బార్ ఏర్పాటు చేరారు. ప్రజా భవన్ గా మార్చిన ప్రగతి భవన్ లో ప్రజాదర్బార్ నిర్వహించారు. తొలిరోజు ప్రజాదర్బార్‌ కిటకిటలాడింది. వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలొచ్చిన ప్రజానీకంతో హైదరాబాద్‌ బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌ కిక్కిరిసిపోయింది. ఇలా ప్రతిరోజు ప్రజాదర్బార్ కు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి బాధితులు వచ్చి తమ ఆర్జీలను ఇచ్చి వెళ్తున్నారు సీఎంతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు దర్బార్‌లో ఉంటున్నారు. ముఖ్యమంత్రి అర్జెంట్ పనిమీదా బయటకు వెళ్లినా.. అక్కడే ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రతి ఒక్కరి నుంచీ వినతిపత్రాలను స్వీకరిస్తున్నారు.

ఒకసారి గత ప్రభుత్వం వద్దకు వెళ్దాం. కేసీఆర్‌ పాలనలో ప్రజలు నేరుగా సీఎంను కానీ మంత్రుల్ని కానీ కలుసుకునే అవకాశం ఉండదు. వారు ఆకాశంలో తారల్లా ఉండేవారు. ప్రజలు ఎవరికి బాధలు చెప్పుకోవాలో తెలియదు. చివరికి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ మాత్రమే గతి అయ్యేది. ఆయన చూసి స్పందించి.. తన ఆఫీసుకు రిఫర్ చేస్తే సాయం అందుతుంది. లేకపోతే లేదు. ఈ పరిస్థితి వల్ల ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే వ్యవస్థ లేకుండా పోయింది.

రేవంత్ సర్కార్.. గ్రీవెన్సు రిజిస్ట్రేషన్లకు ప్రత్యేకంగా 15 డెస్కులను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతీ విజ్ఞాపన పత్రాన్ని ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసి, ప్రత్యేక గ్రీవెన్స్‌ నెంబరును కేటాయించారు. దరఖాస్తుదారులకు ప్రింటెడ్‌ ఎకనాలెడ్జ్‌మెంట్‌ ఇవ్వటంతోపాటు SMS కూడా పంపే ఏర్పాటు చేశారు. ప్రజా దర్బార్‌ తొలి రోజు అనుభవంతో సీఎం రేవంత్‌… ఆ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

వినతుల స్వీకరణ, సమస్యల పరిష్కారానికి ఎక్కువ సమయం తీసుకోకుండా, సులభంగా ఉండేందుకు వీలుగా రోజుకో మంత్రి, ఎమ్మెల్యే దర్బార్‌లో ఉండేలా సీఎం నిర్ణయించారు. చదువు రాని, సోషల్ మీడియా అకౌంట్ గురించి తెలియని వారే ఎక్కువ బాధితులు. నేరుగా సీఎంను కలవడం.. తమ కష్టాలు నేరుగా చెప్పుకునే అవకాశం కల్పించడం మంచి నిర్ణయం అంటున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News