E-Paper
Advertisement

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..
Advertisement

Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సాయంత్రంలోగా మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కొండా సురేఖ డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ విషయమై కాసేపట్లో మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి కాకుండా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు కొండా దంపతులు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలేం జరిగింది?

మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ ఎపిసోడ్‌కు కాసేపట్లో ఫుల్‌స్టాప్ పడనుంది. తనపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకునే లోపు మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు మంత్రి కొండా సురేఖ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధిష్ఠానం నిర్ణయం కంటే ముందుగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారట కొండా దంపతులు.

Advertisement

ప్రస్తుతం అనుచరులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రకటన చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటల లోపు మీడియా ముందుకు వచ్చేందుకు కొండా దంపతులు రెడీ అవుతున్నట్లు ఆమె మద్దతు దారులు చెబుతున్నారు. కీలక నిర్ణయం తీసుకుంటామని అనుచరులతో కొండా దంపతులు తేల్చి చెప్పినట్టు సమాచారం. ప్రజలే తమ బంధువులు, వారి నిర్ణయం మేరకే భవిష్యత్ నిర్ణయం ఉంటుందని చెప్పారట.

కాసేపట్లో మీడియా ముందుకు కొండా దంపతులు

రాజీనామా తర్వాత నెక్ట్స్ అడుగులు ఏంటన్న దానిపై కొండా దంపతులు మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ప్రజల అభిప్రాయం మేరకే తదుపరి రాజకీయ అడుగులు వేస్తామన్న సంకేతాలు ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. రాజీనామా తర్వాత కొండా దంపతుల అడుగులు ఎటు వైపు అన్నది ఆసక్తి నెలకొంది.

Advertisement

మీడియా సమావేశంలో కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై మీడియా ముందు చెప్పాలని డిసైడ్ అయినట్టు అంతర్గత సమాచారం. అంతేకాదు ప్రధానంగా బీసీ అంశాన్ని ప్రధాన ఎజెండాగా ప్రస్తావించాలని భావిస్తున్నారట.

ఢిల్లీలో అసలు ఏం జరిగింది?

ఢిల్లీలో ఏం జరిగింది? మంత్రి పదవికి రాజీనామా చేయాలని కొండా సురేఖకు పార్టీ అధ్యక్షుడు ఖర్గే తేల్చి చెప్పినట్టు ఢిల్లీ సమాచారం. ఒకవేళ రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసేందుకు వెనుకాడమని అన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతా గురువారం సాయంత్రం నాటికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఇండికేషన్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

ఢిల్లీ నుంచి సాయంత్రం హైదరాబాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నారు. ఆ లోపు నిర్ణయాన్ని ప్రకటించాలని తేల్చిచెప్పారు హైకమాండ్ పెద్దలు. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించి ముందుగా రాజీనామా చేస్తే బాగుంటుందని సహచరులు ఆమెకు చెప్పినట్టు సమాచారం.

ALSO READ: హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

Related News

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

మా తీర్పులు కాగితాలకే పరిమితమా..? పీరియడ్ హైజీన్ ఉత్తర్వుల అమలుపై సుప్రీం కోర్టు ఫైర్!

తెలంగాణలో 429 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్..?

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!

వనపర్తి ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టణాభివృద్ధికి రాజా కృష్ణదేవరావు అభయం!

దాండియా ఆడుతూ.. కీలక సందేశాన్నిచ్చిన సైబరాబాద్ పోలీసులు!

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

Big Stories

Advertisement
×