E-Paper
Advertisement

అమెరికాలో తెలుగు టెక్కీ మృతి, అసలు ఏం జరిగింది?

అమెరికాలో తెలుగు టెక్కీ మృతి, అసలు ఏం జరిగింది?
Advertisement

Hyderabad: చదువు, ఉద్యోగాల కోసం ప్రతీ ఏటా వేలాది మంది యువతీయువకులు తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్తున్నారు. అక్కడి పరిస్థితుల వల్ల చాలామంది మృత్యువాత పడుతున్న సందర్భాలు వెలుగులోకి వస్తాయి. తాజాగా తెలుగు టెక్కీ రావుల పవన్‌ సాయి వంశీ మృతి చెందాడు. కొడుకు మరణ వార్త తెలియగానే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అసలు ఏం జరిగింది?

అమెరికాలో తెలుగు టెక్కీ సాయివంశీ మృతి

అమెరికాలోని తెలుగు కమ్యూనిటీలో విషాదం జరిగింది. ఐబీఎంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న 36 ఏళ్ల రావుల పవన్‌ సాయి వంశీ ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. సెప్టెంబర్ 9న కాలిఫోర్నియాలోని తన నివాసంలో పిల్లలతో ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. పవన్‌ గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. హైదరాబాద్‌లోని బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌ ప్రాంతానికి చెందినవాడు సాయివంశీ.

బేగంపేట్ ఆయన ఇంట్లో విషాదం, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు

Advertisement

సరిగ్గా పదేళ్ల కిందట అంటే 2016లో ఎంబీఏ చదివేందుకు అమెరికా వెళ్లారు. చదువు తర్వాత అక్కడే 2018లో ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం సాయి వంశీ ఐబీఎంలో పని చేస్తున్నారు. ఫ్యామిలీతో అక్కడే సెటిలైన ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాయి వంశీ ఆకస్మిక మరణంతో అతడి నివాసం వద్ద విషాదం అలముకుంది. సాయి వంశీ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. మంగళవారం బన్సీలాల్‌ పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.

ALSO READ: సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ పీఏ, పీఆర్వో ఉన్న రూమ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు!

Related News

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ పీఏ, పీఆర్వో ఉన్న రూమ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు!

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

Big Stories

Advertisement
×