E-Paper
Advertisement

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  
Advertisement

Ninnu kori serial today Episode: హాస్పిటల్‌ బయటకు వచ్చిన విరాట్‌కు తన పేరు గుర్తుకు రాకపోవడంతో మదన్‌ విరాట్‌ అని చెప్తాడు. విరాట్‌ అని ఎలా చెప్తున్నారు అని అడిగితే.. ఏదో అలా చెప్పేశాడని మీ అసలు పేరు గుర్తుకు వచ్చే వరకు విరాట్‌ అనే కంటిన్యూ అవ్వండి అని చెప్తూ చంద్ర ఏడుస్తుంటే.. విరాట్‌ అదేంటి మీరు కన్నీళ్లు పెడుతున్నారు అని అడిగితే ఇవి కన్నీళ్లు కావండి మీరు త్వరగా కోలుకున్నారని వస్తున్న ఆనందభాష్పాలు అంటూ చంద్ర చెప్తుంది. నేను కోలుకోవడనికి కారణం మీరిద్దరూ నా పక్కన ఉండి నన్ను జాగ్రత్తగా చూసుకోవడం వల్లే అంటూ విరాట్‌ చెప్తుంటాడు. అప్పుడే ఒక రౌడీ అక్కడికి వచ్చి తన బాస్‌కు ఫోన్‌ చేసి సామ్రాట్‌ బతికే ఉన్నాడని చెప్తాడు. ఆ బాస్‌ వాడు నిజంగా సామ్రాటే అయితే వాడిని మళ్లీ చంపేయండి అని చెప్తాడు. రౌడీ సరే అంటాడు.

చంద్ర డాక్టర్‌ దగ్గరకు వెళ్తుంది. విరాట్‌ను తీసుకెళ్లొచ్చని డాక్టర్‌ చెప్పగానే.. చంద్ర ఆలోచిస్తుంది. విరాట్‌ను ఎక్కడికి తీసుకెళ్లాలని ఆలోచిస్తుంది. అప్పుడే రఘురాం ఫోన్‌ చేసి జగదీశ్వరికి ఆపరేషన్‌ సక్సెస్‌ అయిందని చెప్తాడు. చంద్ర హ్యాపీగా ఫీలవుతుంది. చంద్ర సంతోషంగా జగదీశ్వరితో మాట్లాడుతుంది. జగదీశ్వరి, విరాట్‌ గురించి అడుగుతుంది. తన ఆపరేషన్‌ పూర్తి అయ్యేలోపు వస్తానన్నాడు ఇంకా రాలేదేంటని అడుగుతుంది. అందుకు షాలిని ఇంకెప్పటికీ రాడులేండి అత్తయ్య అని మనసులో అనుకుంటుంది. చంద్ర మాత్రం ఆయన ఇప్పుడే బెంగుళూరులో బయలుదేరారట అత్తయ్య అని చెప్తుంది. మనసులో మాత్రం అత్తయ్యకు ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది కాబట్టి నిజం చెప్పాలి అనుకుంటుంది. చంద్ర మాటలకు విన్న షాలిని షాక్‌ అవుతుంది. విరాట్‌ను ఎలా తీసుకువస్తుంది అని మనసులో అనుకుంటుంది.

Advertisement

హాస్పిటల్‌లో ఉన్న మదన్‌, చంద్ర దగ్గరకు వెళ్లి డాక్టర్‌ ఏమన్నారు అని అడగ్గానే.. డిశ్చార్జి చేస్తామన్నారు. విరాట్‌ను తీసుకెళ్లమని చెప్పారు అనగానే.. మదన్‌ హ్యాపీగా ఫీలవుతాడు. చంద్ర మాత్రం విరాట్‌ను ఎలా తీసుకెళ్లాలి అంటూ ఆలోచిస్తుంది. అయితే తాను ఒక్కదాన్ని ముందుగా వెళ్లి ఇంట్లో అత్తయ్యను, మామయ్యను కన్వీన్స్‌ చేయాలనుకుంటుంది.

చంద్ర ఇంటికి వెళ్లే సరికి జగదీశ్వరి నిద్రపోతుంది. రఘురాం చూసి చంద్రకు విషయం చెప్తాడు. అత్తయ్యతో ఏదైనా మాట్లాడాలా అని అడిగితే.. లేదు మామయ్య రేపు ఉదయం మాట్లాడతాను పడుకోనివ్వండి అంటూ చెప్పి బయటకు వెళ్లగానే.. షాలిని అనుమానంగా చంద్రను విరాట్‌ నిజంగానే వస్తున్నాడా..? అని అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నావు అని చంద్ర అడిగితే.. బావగారు నిజంగానే వస్తున్నారా..? లేక అత్తయ్య గారి బాధను పోగొట్టడానికి నువ్వు అలా చెప్పావా…? అంటూ షాలిని అడగ్గానే.. రేపు ఆయన వచ్చాక అన్ని తెలుస్తాయి షాలిని అనగానే.. షాలిని షాక్‌ అవుతుంది. అసలు బావగారు ఎలా బతికారు అని షాలిని మనసులో అనుకుంటుంది.

Advertisement

హాస్పిటల్ లో ఐసీయూ బయట మదన్‌ పడుకుని ఉంటాడు. లోపల విరాట్‌ నిద్రపోతుంటాడు. అప్పుడే కొందరు రౌడీలు ఐసీయూలోకి వెళ్లి కత్తులతో విరాట్‌ను చంపాలని చూస్తారు. అప్పుడే మెలుకువ వచ్చిన విరాట్‌ ఉలిక్కిపడి లేచి రౌడీలను కొడుతుంటాడు. ఒక రౌడీ మాత్రం అన్ని పోట్లు పడినా ఎలా బతికావురా సామ్రాట్‌ అనగానే.. విరాట్‌ నా పేరు సామ్రాట్టా..? అనుకుంటాడు. రౌడీలు అందరూ కలిసి పట్టుకుని చంపబోతుంటే.. అప్పుడే మదన్‌ లోపలికి వస్తాడు. మదన్‌ కూడా రౌడీలను కొడుతూ.. డాక్టర్‌ అంటూ కేకలు వేయగానే.. రౌడీలు పారిపోతారు. విరాట్‌ స్పృహ కోల్పోతాడు. నర్స్‌ వచ్చి విరాట్‌ను బెడ్‌ మీద పడుకోబెట్టి వెళ్తుంది.

మరుసటి రోజు ఉదయమే మదన్‌, చంద్రకు ఫోన్‌ చేసి రాత్రి విరాట్‌ మీద జరిగిన హత్యాయత్నం గురించి చెప్తాడు. వెంటనే చంద్ర హాస్పిటల్‌కు వెళ్తుంది. విరాట్‌ గారు మీకు ఏం కాలేదు కదా…? అంటూ కంగారు పడుతుంది. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. మాటిచ్చిన ప్రేమ.. తిరుపతి ఎంట్రీతో భాగ్యంకు షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టించే సీన్.. అయ్యో పాపం పార్వతి..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

Big Stories

Advertisement
×