E-Paper
Advertisement

BRS vs Congress : తోలుతీస్తా దుమారం.. ఇంకెంత దూరం వెళ్తుందో!

BRS vs Congress : తోలుతీస్తా దుమారం.. ఇంకెంత దూరం వెళ్తుందో!

రాష్ట్రంలో పొలిటికల్ పంచుల దుమారం రేగుతూనే ఉన్నది. ఇటీవల మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చి రాష్ట్ర కార్యవర్గస్థాయి సభ్యులతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఇకమీదట తెలంగాణ సమాజానానికి, ప్రజానీకానికి జరిగే అన్యాయాన్ని సహించేది లేదని.. రెండేళ్లు చూస్తూ ఉన్నానని.. ఇదివరకు ఒక లెక్క.. ఇక నుంచి ఓ లెక్క అంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. ఆ తర్వాత కేసీఆర్‌పై కాంగ్రెస్ మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.

తోలుతీస్తా అంటావా?

కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తోలుతీస్తా? అంటూ హెచ్చరించడంపై అటు కాంగ్రెస్ మంత్రులు భగ్గుమన్నారు. గత పదేండ్లు చేసిన విధ్వంసాన్ని తమ ప్రభుత్వం సరైన దారిలో పెడుతుంటే అభినందిచాల్సింది పోయి విమర్శలు, వార్నింగులు ఇస్తారా? అంటూ మంత్రులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. కేసీఆర్ ఎవరి తోలుతీస్తారని, ఎందుకు తీస్తారో చెప్పాలని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు వృథా చేశారని, కార్పొరేషన్లను అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా అప్పులు చేశారని, కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు, వడ్డీలు కడుతూ భారం తగ్గించే ప్రయత్నం చేస్తుంటే తమనే బెదిరిస్తారా? అంటూ మండిపడ్డారు.

లాగుల తొండలు విడుస్తా కేటీఆర్..

కేసీఆర్ బెదిరింపులపై ఇటీవల మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ సైతం ఘాటుగా స్పందించారు. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరుగా.. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఎందుకు అనడం ఊరికే అని ఊరుకుంటే.. మమ్మల్నే బెదిరిస్తారా? అంటూ ఫైర్ అయ్యారు.పాస్‌పోర్టు బ్రోకర్ కేసీఆర్..నువ్వెంత? అన్న స్థాయిలో రెచ్చిపోయారు.నిన్ను, నీ కుటుంబాన్ని రాజకీయంగా దూరం చేస్తానంటూ హెచ్చరించారు. కేసీఆర్‌కు ఫాంహౌసే జైలు.. మళ్లీ జైలులోపెట్టడం దండగ అంటూ విమర్శించారు. ఇక ‘చిప్పలు కడుక్కునే వెదవ కేటీఆర్.. నాతోనే పెట్టుకుంటావా? నన్నే విమర్శిస్తావా? లాగుల తొండలు విడిచి కొడతా?’ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

తాజాగా దీనిపై అటు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, కీలక నేతలు భగ్గుమంటున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి అంత దిగజారి మాట్లాడుతారా? ఇదేనా నీ రాజకీయం అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిని ఓడించాకే కేటీఆర్ పులిలాగా అసెంబ్లీలో అడుగుపెడతారని.. నీ సవాల్ స్వీకరించాల్సిన అవసరం ఏముంది? రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రేవంత్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదని, భాష మార్చుకోవాలని మాజీ స్పీకర్ మధుసూధనా చారి సైతం హితవు పలికారు. రేవంత్ స్థాయి అంతే అని, ఇంతకు మించి ఏం చెబుతామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ నువ్వు రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు.ఈ డైలాగుల వార్ అంతా కేసీఆర్ ప్రారంభించిందే అని.. ‘తోలుతీస్తా ఒక్కొక్కరిది’ అని కేసీఆర్ అనకపోతే ఇదంతా ఉండునా? అని నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయాలు హుందాగా ఉండాలని.. మాజీ సీఎం.. ప్రస్తుత సీఎం కాస్త భాష మార్చుకోవాలని సీనియర్లు సూచిస్తున్నారు. కాగా, ఈ  తిట్ల దుమారం ఇంకెంతో దూరం వెళ్తుందో అని కూడా చర్చ జరుగుతున్నది.

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×