Deepak Reddy: ఏపీలోని ఐఏఎస్ అధికారుల పనితీరుపై మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్‌రెడ్డి (Deepak Reddy) చేసిన వ్యాఖ్యలు రాజకీయ, అధికార వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఐఏఎస్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు వ్యవస్థకు పట్టిన గ్రహణంలా, దరిద్రంలా తయారయ్యారని ఘాటుగా విమర్శించారు.
తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ.. సీడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న తనకు గత 14 నెలలుగా జీతం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఫైనాన్స్ సెక్రటరీకి (Finance Secretary) ఎన్నిసార్లు చెప్పినా ఫైల్ క్లియర్ చేయడం లేదని మండిపడ్డారు. “14 నెలలైనా ఒక చిన్న ఫైల్ క్లియర్ చేయలేని వారికి అసలు ఆ సీట్లో కూర్చునే అర్హత ఉందా?” అని నిలదీశారు.
మెజార్టీ ఐఏఎస్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని దీపక్ రెడ్డి ఆరోపించారు. కేవలం డబ్బు కోసమే ఫైళ్లను ఆపేస్తూ, పాలనను బాటిల్‌నెక్ (Bottleneck)గా మారుస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో ఆయన ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. “ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తన కూతురి పెళ్లికి రూ.1000 కోట్ల కట్నం (Dowry) ఇస్తానని స్వయంగా నాతోనే చెప్పారు. ఇలాంటి దొంగలు వ్యవస్థలో చాలా మంది ఉన్నారు,” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజా ప్రతినిధులు, ప్రజల కోసం పనిచేయాల్సిన కలెక్టర్లు, ఐఏఎస్‌లు ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న దీపక్ రెడ్డి.. సొంత ప్రభుత్వ అధికారులపౖనే ఈ స్థాయి విమర్శలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది.
Read Also: West Godavari News: సార్.. నన్ను కాపాడండి, ‘బిగ్ టీవీ’ ట్వీట్‌పై మంత్రి లోకేష్ రియాక్ట్, మహిళకు సాయం