BigTV English

Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. సీబీఐ.. కవిత.. ట్విస్టులే ట్విస్టులు..

Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. సీబీఐ.. కవిత.. ట్విస్టులే ట్విస్టులు..

Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసుల జారీ చేయడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. డిసెంబర్ 6న హైదరాబాద్ లోని నివాసంలో కవితను సీబీఐ విచారించాల్సి ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది. తన నివాసంలో సీబీఐకు వివరణ ఇచ్చేందుకు సిద్ధమని తొలుత కవిత ప్రకటించారు.


తొలి ట్విస్ట్..
అయితే తర్వాత రోజు ప్రగతి భవన్ కి వెళ్లి తన తండ్రి, సీఎం కేసీఆర్ తో కవిత సుధీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత ప్లాన్ మార్చారు. ఢిల్లీ మద్యం స్కామ్ పై నమోదైన ఎఫ్ఐఆర్, ఫిర్యాదు కాపీలు పంపించాలని సీబీఐకు లేఖ రాశారు. సీబీఐ కూడా అంతే వేగంగా రిఫ్లై ఇచ్చింది. సీబీఐ వెబ్ సైట్ లో ఎఫ్ఐఆర్, ఫిర్యాదు కాపీలు చూసుకోవచ్చని మెయిల్ ద్వారా కవిత లేఖకు సీబీఐ సమాధానమిచ్చింది.

రెండో ట్విస్ట్ ..
సీబీఐ రిఫ్లై తర్వాత కవిత మరో ట్విస్ట్ ఇచ్చారు. తాను ఎఫ్ఐఆర్ , ఫిర్యాదు కాపీలన్నీ పరిశీలించానని అందులో ఎక్కడా తన పేరులేదని స్పష్టంచేశారు. అదే సమయంలో సీబీఐకు కవిత మరోలేఖ రాశారు. డిసెంబర్ 6న తాను సీబీఐకు అందుబాటులో ఉండలేనని సమాచారమిచ్చారు. ఎప్పుడు తనను కలవాలో సీబీఐకి ఆఫ్షన్లు కూడా ఇచ్చారు. డిసెంబర్ 11,12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా సరే తన నివాసంలో అందుబాటులో ఉంటానని సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తాజా లేఖ ద్వారా బంతిని మరోసారి సీబీఐ కోర్టులోకి కవిత విసిరారు.


సీబీఐ ఏం చేస్తుంది
మరి కవిత లేఖకు సీబీఐ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. వాస్తవంగా ఈ నెల 6న ఆమెను విచారించాల్సిఉంది. సీబీఐ మరోసారి కవితకు సమాధానం ఇస్తుందా? లేక ఈ నెల 6న విచారించేందుకు సిద్ధమవుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. లేక కవిత ఇచ్చిన ఆఫ్షన్ల్ లో ఏదో ఒక తేదీని సీబీఐ ఫిక్స్ చేస్తుందా అనే ఆసక్తి నెలకొంది. మరి సీబీఐ ఎలా ముందుకు వెళుతుందో చూడాలి మరి.

వ్యూహం ఇదే..
ప్రగతి భవన్ లో తండ్రి కేసీఆర్ తోపాటు న్యాయనిపుణులతోనూ సీబీఐని ఎలా ఎదుర్కొనాలనేదానిపై సుధీర్ఘంగా కవిత చర్చించారు. ఆ తర్వాతే తన వ్యూహాన్ని మార్చారు. విచారణను మరో 5 రోజులు పొడిగించారు. ఈలోపు ఈ కేసుపై లీగల్ గా మరింత క్లారిటీ తీసుకోవాలన్నదే కవిత ఉద్ధేశం. సీబీఐ అధికారుల నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి?. వాటికి ఎలా సమాధానం ఇవ్వాలని అనేదానిపై స్పష్టత రావడం కోసమే కవిత సీబీఐకు రెండో లేఖను సంధించారని తెలుస్తోంది. మరి ముందుముందు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×