Unemployed Youth : ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన యువత బీఆర్‌ఎస్‌పై కన్నెర్ర చేస్తున్నారు. తమను పట్టించుకోని కేసీఆర్‌ను గద్దె దించాలని ఆగ్రహంగా ఉన్నారు. ఈ వ్యతిరేకతను పోగొట్టి .. తమను బుజ్జగించే పనిలో భాగంగా కొందరు యువతతో కేటీఆర్ సమావేశమై.. మళ్లీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు పక్కా అనే హామీని, భరోసాను కల్పించారు.
ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న విద్యార్థులతో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే హైదరాబాద్ అశోక్‌నగర్‌లో భేటీ అవుతానని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీనికి తోడు నిరుద్యోగ యువతతో ఇటీవల మంత్రి కేటీఆర్ టీహబ్‌లో సమావేశమయ్యారు. పదేళ్లలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసి.. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడంపై యువత, విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఓయూకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వాలంటూ సవాళ్లు విసురుతున్నారు.
కేటీఆర్ హామీలు అక్కడితో ఆగలేదు. టీఎస్‌పీఎస్పీ ప్రక్షాళన, ఉద్యోగాల భర్తీపై హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఎన్నికల ఫలితాల మరుసటి రోజే అశోక్‌నగర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతను కలుస్తామని భరోసా ఇచ్చారు. విద్యార్థుల సూచన మేరకు గ్రూప్ 2 ఉద్యోగాలను పెంచి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని.. మళ్లీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడదల చేస్తామని.. టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేస్తామని హామీ ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో కేటీఆర్‌ను నమ్మేది లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.
.
.
.