OTT Movie : బ్రిటన్‌లోని ది న్యూస్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఓనర్ రూపర్ట్ ముర్డాక్ పత్రికల్లో జరిగిన భారీ ఫోన్ హ్యాకింగ్ స్కాండల్ ఆధారంగా తీసిన సిరీస్ ‘ది హ్యాక్’ సీజన్ 1. ఈ సిరీస్ UKలో జరిగిన అతిపెద్ద కుంభకోణంతో ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఇక్కడ ది న్యూస్ ఇంటర్నేషనల్ వార్తాపత్రిక వందలాది మంది ప్రజల మొబైల్ ఫోన్ వాయిస్ మెయిల్‌లను రహస్యంగా విన్నదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వార్త ఒక సెన్సేషన్ అయింది. వార్తాపత్రిక చాలా కాలంగా ఉంచిన ఈ రహస్యం ఆశ్చర్యకరంగా ఎలా బయటపడిందో ఈ సిరీస్ ఉత్కంఠంగా చూపిస్తుంది. ఈ సిరీస్ 2002-2012 మధ్య జరిగిన ఈ స్కాండల్‌ను గ్రిప్పింగ్‌గా చూపిస్తుంది. ఫోన్ హ్యాకింగ్ సిరీస్ కావడంతో, ఆడియన్స్ కూడా ఈ సిరీస్ ని ఇంట్రెస్టింగ్ గా చూసేస్తున్నారు. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ది హ్యాక్’ (The Hack) థ్రిల్లర్ మినీ సిరీస్ ను. జాక్ మార్క్ పైటన్ డైరెక్షన్‌లో రూపొందింది. ఇందులో ఇందులో స్టీవ్ పెంబర్టన్, ఈవ్ మైల్స్, డౌగ్రే స్కాట్, లిసా మెక్‌గ్రిల్లిస్ మెయిన్ రోల్స్ లో నటించారు. 7 ఎపిసోడ్ల ఈ సిరీస్ 2025 సెప్టెంబర్ 24న ITVXలో ప్రీమియర్ అయింది. ఇండియాలో మాత్రం నవంబర్ 7 నుంచి లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది రిలీజ్ అయిన వెంటనే బ్రిటిష్ టీవీ అవార్డుల్లో బెస్ట్ డ్రామా సిరీస్, బెస్ట్ రైటింగ్ (జాక్ థోర్న్), బెస్ట్ యాక్టర్ (డేవిడ్ టెన్నంట్) నామినేషన్స్ సంపాదించింది. BAFTA టీవీ అవార్డ్స్ 2026లో మల్టిపుల్ నామినేషన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఎమ్మీ ఇంటర్నేషనల్ కేటగిరీలో కూడా బజ్ క్రియేట్ చేసింది.
Read Also : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో
ఈ టీవీ షో రెండు దర్యాప్తులను హైలైట్ చేస్తుంది. ఒక కథనం ఒక జర్నలిస్ట్ ప్రజల ఫోన్‌లను చట్టవిరుద్ధంగా వినే భారీ కుంభకోణాన్ని తవ్వుతుండగా, మరొకటి 1987లో ప్రైవేట్ డిటెక్టివ్ డేనియల్ మోర్గాన్ హత్యకు సంబంధించి ఉంటుంది. ఈ రెండు వేర్వేరు కేసులు అయినప్పటికీ చివరికి వార్తాపత్రికలు, పోలీసులు శక్తివంతమైన రాజకీయ నాయకులకు లింక్ అవతాయి. మొదటి సీజన్ అంతటా, ప్రేక్షకులు జర్నలిస్ట్ నిక్ డేవిస్ ఫోన్ హ్యాకింగ్ ఆధారాలను తవ్వి తీయడం చూస్తారు. దీంతో పాటు రిటైర్డ్ డిటెక్టివ్ డేనియల్ హత్య కేసును పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఇది పార్లమెంటరీ కమిటీ విచారణతో ముగుస్తుంది. అక్కడ వార్తా పత్రిక యజమాని రూపర్ట్ ముర్డోక్ ప్రశ్నలను ఎదుర్కొంటాడు. చివరి ఎపిసోడ్ దర్యాప్తు విజయవంతమైందని తెలుపుతుంది. ఇందులో ఏడు ముఖ్యమైన పోలీసు దర్యాప్తుల్లో ఫోన్ హ్యాకింగ్ కుంభకోణానికి సంబంధించిన దాదాపు నలభై మంది దోషులుగా నిర్ధారించబడ్డారు. ఈ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కి మస్ట్ వాచ్ స్టోరీగా చెప్పుకోవచ్చు.