Dak Sewa app: భారతదేశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థాగత సేవల్లో తపాలాకు ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా తపాలా శాఖ తన సేవలను డిజిటల్ యుగానికి సర్దుబాటు చేసేందుకు మరో ముందడుగు వేసింది. ‘డాక్ సేవా’ పేరిట కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఇది పాత ‘పోస్ట్ ఇన్ఫో’ యాప్ స్థానంలో వచ్చింది. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ రూపొందించిన ఈ యాప్, వినియోగదారులకు 8 రకాల కీలక సేవలను ఒకే చోట అందిస్తుంది. ఆధునిక ఇంటర్‌ఫేస్‌తో ఈ యాప్ పని చేయడం చాలా సులభం. దీంతో ఇకపై పోస్ట్ ఆఫీసులకు వెళ్లకుండా ఇంటి నుంచే పనులు పూర్తి చేయవచ్చు.
స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, పార్శిల్స్, ఈ-మనీ ఆర్డర్‌లను రియల్ టైమ్‌లో ట్రాక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ట్రాకింగ్ నెంబర్ ఎంటర్ చేస్తే, ప్యాకేజీ ఎక్కడుందో క్షణాల్లో తెలిసిపోతుంది.
మీకు దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్ వివరాలు, పని గంటలు, సేవలను సులభంగా తెలుసుకోవచ్చు. మ్యాప్‌లో లొకేషన్ కూడా కనిపిస్తుంది.
మీరు పంపించాలనుకుంటున్న పార్శిల్ బరువు, లొకేషన్‌ను బట్టి ఛార్జీలను ముందుగానే లెక్కించవచ్చు. ఈ సదుపాయం మీ సమయాన్ని ఆదా చేస్తుంది.
తపాలా వల్ల మీకు ఏదైనా సమస్యలు ఉంటే.. ఆన్‌లైన్‌లో కంప్లైంట్ ఫైల్ చేసి, స్టేటస్ చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది.
ఇందులో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) ప్రీమియంలను లెక్కించవచ్చు.
ఈ సేవింగ్స్ స్కీమ్స్ కాలిక్యులేరట్ ద్వారా సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్ డిపాజిట్ వంటి పథకాలపై వడ్డీ వివరాలను తెలుసుకోవచ్చు.
మీ నెలవారీ బిల్లులు, ఫీజులు ఆన్‌లైన్‌లో చెల్లించుకోవచ్చు. ఈ యాప్ యూపీఐ, కార్డ్‌లను సపోర్ట్ చేస్తుంది.
ఇందులో బిజినెస్ కస్టమర్లకు ప్రత్యేక టూల్స్, రిపోర్టింగ్ ఆప్షన్లు ఉన్నాయి.
డాక్ సేవా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం సులభం. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్లో Dak Sewa App అని టైప్ చేస్తే, అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న అధికారిక యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌ను ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోవచ్చు.