E-Paper
Advertisement

Manas Wedding : పెళ్లి పుస్తకం మొదలు పెడుతున్న బ్రహ్మముడి రాజ్..

Manas Wedding : పెళ్లి పుస్తకం మొదలు పెడుతున్న బ్రహ్మముడి రాజ్..
Advertisement
Manas Wedding

Manas Wedding : టీవీ సీరియల్స్ కి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. క్రేజ్ పెరుగుతున్న కొద్దీ టీవీ సీరియల్స్ లో నటిస్తున్న యాక్టర్స్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు వాళ్ళ లైఫ్ లో ఏదైనా మంచి జరిగితే తమ ఇంట్లో ఏదో శుభకార్యం జరిగినట్టు ప్రేక్షకులు ఆనందిస్తున్నారు కూడా. అలా ప్రస్తుతం ఉన్న టీవీ సీరియల్స్ అన్నిటిలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న షో బ్రహ్మముడి. ఇందులో రాజ్ క్యారెక్టర్ లో నటిస్తున్న మానస్ పెళ్లి కొడుకు అయ్యాడు.

బిగ్ బాస్ ఫేమ్.. బుల్లితెర సెలబ్రిటీ మానస్ వివాహం నిన్న రాత్రి విజయవాడలోని మురళి రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది. చెన్నై కు చెందిన శ్రీజ ను మానస్ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటుగా బుల్లితెర.. వెండితెర సెలబ్రిటీలు హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న మానస్.. తన ఆటతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ‘మ్యానస్ 24’ సిరీస్ తో అభిమానులకు మరింత దగ్గరయ్యాడు.

Advertisement

రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 7 లో తన ఫ్రెండ్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినా అమర్దీప్ కు సపోర్టుగా స్టేజి పైకి వచ్చిన మానస్ ..పనిలో పనిగా తన పెళ్లి నవంబర్ 22న జరగబోతోంది అని కూడా చెప్పేశాడు. మానస్.. శ్రీజా లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మానస్ ని పెళ్ళికొడుకు చేయడం..మంగళ స్నానం .. మొదలైన అన్ని కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

కోయిలమ్మ సీరియల్ తో మానస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా హౌస్ లో మెచ్యూర్డ్ గేమ్ తో ఫైనలిస్ట్ గా నిలిచాడు. సన్నీ తో కలిసి కాకుండా విడిగా తన గేమ్ తాను ఆడి ఉంటే ఆ సీజన్ విన్నర్ మానస్ అనడంలో డౌట్ లేదు. బిగ్ బాస్ తరువాత ప్రస్తుతం స్టార్ మా లో వస్తున్న బ్రహ్మముడి సీరియల్ తో బుల్లితెర స్టార్ హీరోగా మారాడు. ఈ సీరియల్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా చూడవచ్చు. ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ కూడా టాప్ లో ఉంది. ఇక ఇందులో రాజ్ పాత్రలో మానస్ ఇరగదీస్తున్నాడు. ఇక ఆ విషయం పక్కన పెడితే పెళ్లి చేసుకున్న కొత్త జంట కి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×