Big Stories

KCR: ఏప్రిల్ నుంచే నిరుద్యోగ భృతి.. కేసీఆర్ కు షాక్..

KCR: అసలే ఎన్నికల సీజన్. ప్రతీ అంశమూ కీలకమే. ఎక్కడో స్విచాఫ్ చేస్తే.. మరెక్కడో బల్బ్ ఆరిపోతుంది. అంతా ఇంటర్ లింక్ కావడమే రాజకీయమంటే. యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. కర్నాటకలో హిజాబ్ ఇష్యూ రచ్చ చేయడం అలాంటిదే అంటారు. ఇదంతా ఎందుకుంటే, సీఎం కేసీఆర్ కు సైతం ఎన్నికల ముందు ఇలాంటి షాకే ఒకటి తగిలేలా ఉంది. అదే నిరుద్యోగ భృతి.

- Advertisement -

ఈ మాట ఎప్పుడో విన్నట్టుంది కదా. అదే గత ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో నిరుద్యోగులందరికీ 3వేల అలవెన్స్ ఇస్తానంటూ హామీ ఇచ్చారు గులాబీ బాస్. నిరుద్యోగ భృతి ప్రకటనతో అప్పటి వరకూ కేసీఆర్ సర్కారుపై యువతలో ఉన్న వ్యతిరేకత కాస్త చల్లారింది. ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలిచింది. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యారు. ఎప్పటిలానే ఇచ్చిన హామీని మరిచారు. నాలుగేళ్లు గడిచినా.. త్వరలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నా.. ఇప్పటికీ నిరుద్యోగ భృతి మీద ఉలుకూలేదు.. పలుకూలేదు.

- Advertisement -

అయితే, తెలంగాణలానే ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌ లోనూ నిరుద్యోగ భృతి ప్రకటించింది అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) నుంచి యువతకు ప్రతినెలా నిరుద్యోగ భృతి చెల్లించనున్నట్టు సీఎం భూపేశ్‌ బఘేల్‌ కీలక ప్రకటన చేశారు. నెలకు ఎంత మొత్తాన్ని ఇస్తారనే విషయం మాత్రం చెప్పలేదు.

కేసీఆర్ లానే 2018 ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ఇప్పుడా హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. బస్తర్‌ జిల్లా జగదల్‌పూర్‌ రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా వచ్చే ఆర్థిక ఏడాది (ఏప్రిల్ నుంచే మొదలు) నుంచి నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం ఆసక్తికరం. అంటే, లేటైనా ఇచ్చిన హామీని నెరవేరుస్తోంది ఛత్తీస్‌గఢ్‌ లోని కాంగ్రెస్ సర్కార్.

ఇదే ఇప్పుడు గులాబీ బాస్ లో గుబులు రేపుతోంది. అక్కడ నిరుద్యోగ భృతి ఇవ్వడం స్టార్ట్ చేస్తే.. ఇక్కడ రీసౌండ్ రావడం పక్కా. తెలంగాణ నిరుద్యోగులు ఛత్తీస్ గఢ్ లానే తమకూ భృతి ఇవ్వాల్సిందేనని ఉద్యమించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రముఖంగా ప్రచారం చేసుకోవచ్చు. ఆ మేరకు రాజకీయంగా లాభపడొచ్చు.

దేశంలోకి తెలంగాణే నెంబర్ వన్ రాష్ట్రం అంటూ ఊదరగొట్టే కేసీఆర్.. నిరుద్యోగ భృతిపై వెనకడుగు వేస్తే.. అది ఆయనకే నష్టం. అసలే యువత. అందులోనూ నిరుద్యోగులు. వారు తలుచుకుంటే ప్రభుత్వాలే తలకిందులు. అందుకే, ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ సీఎం చేసిన పని ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ను టెన్షన్ కు గురి చేస్తోందని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News